RRR ఆలియా నిశ్చితార్థం లేదు.. కేవ‌లం NYE 2021 వేడుక‌ల‌కే

Update: 2020-12-30 07:30 GMT
రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం నేడు (30 డిసెంబ‌ర్ 2020) జ‌ర‌గ‌నుంది!! అంటూ బాలీవుడ్ మీడియాలో గుస‌గుస‌లు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. విమానాశ్ర‌యంలో ఇరువురి కుటుంబ స‌భ్యులు బంధుమిత్రులు గ్రూపులుగా క‌నిపించ‌డంతో అంతా ఓచోట చేరి సైలెంట్ గా నిశ్చితార్థం కానిచ్చేస్తున్నార‌ని ఒక‌టే ప్ర‌చారం సాగిపోయింది.

అయితే అలాంటిదేమీ  జరగడం లేదని తాజాగా ర‌ణ‌బీర్ మామ‌ రణధీర్ కపూర్ ధృవీకరించారు. అలియా భట్ - రణబీర్ కపూర్- ర‌ణ‌బీర్ త‌ల్లిగారు నీతు కపూర్- రిద్దిమా కపూర్ సాహ్ని 2021 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను రణతంబోర్ (రాజ‌స్థాన్ జైపూర్ )లో ప్లాన్ చేశారు. కేవ‌లం ఈ వేడుక కోస‌మే ప్ర‌యాణ‌మ‌య్యారు. అంతేకానీ.. ఎలాంటి నిశ్చితార్థం జ‌ర‌గ‌డం లేద‌ని రణబీర్ మామ రణధీర్ కపూర్ ప్ర‌ముఖ జాతీయ మీడియాకు తెలిపారు. ``రణబీర్ - అలియా ఈ రోజు నిశ్చితార్థం చేసుకుంటే.. నా కుటుంబం ..నేను కూడా వారితో కలిసి ఉండేవాళ్లం. రణబీర్- అలియా -నీతు సెలవుల‌ను ఆస్వాధించేందుకు కొత్త సంవత్సరాన్ని సెల‌బ్రేట్ చేసేందుకు అక్కడకు వెళ్లారు. వారి నిశ్చితార్థం వార్తలు నిజం కాదు`` అని ర‌ణ‌ధీర్ వెల్ల‌డించారు.

కొద్ది రోజుల క్రితమే రణబీర్ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన‌య్యారు. ``మహమ్మారి మన జీవితాలను టార్గెట్ చేయ‌క‌పోతే అది (పెళ్లి) అప్పటికే అయ్యేదని నేను అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక‌టి అనేయ‌డం ఇష్టం లేదు. నేను నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని గుర్తించబోతున్నాను`` అని ప్ర‌ముఖ మీడియాకి వెల్ల‌డించారు.

ఇటీవ‌ల‌ క్రిస్మస్ వేడుకల్లో క‌లిసిన‌ అలియా భట్ -రణబీర్ కపూర్ ప్ర‌స్తుతం కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ జంట ఒకరితో ఒకరు డేటింగ్ మొద‌లు పెట్టార‌ని 2017 లో పుకార్లు ప్రారంభమయ్యాయి. మే 2018 లో సోనమ్ కపూర్ వివాహ రిసెప్షన్ కు హాజరుకావడం ద్వారా ఇద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు గుర్తించారు. 2021 లో విడుదల కానున్న అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర`లో ఈ క్రేజీ పెయిర్ జోడీగా క‌నిపించ‌నున్నారు.
Tags:    

Similar News