నాగ్ అందుకే ఒప్పుకున్నాడట!!

Update: 2018-09-22 07:32 GMT
మన తెలుగు స్టార్స్ హీరోలలో నాగార్జునకు ఒక స్పెషాలిటి ఉంది.  హిందీలో స్ట్రెయిట్ సినిమామాలలో సోలో హీరోగా నటించి హిట్ సాధించిన హీరో నాగ్ ఒక్కడే.  అంతే కాదు బాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలలో కీలకపాత్రలు పోషించి హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. కానీ తర్వాత ఎందుకో హిందీలో సినిమాలు చేయడం పూర్తిగా మనేశాడు. కానీ పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' అనే హిందీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకొని అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. మరి ఇన్నేళ్ళ తర్వాత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిన కారణం ఏంటి?

'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదట నాగార్జునను కలిసి స్టోరీ వినిపించాడట. కానీ ఫాంటసీ ఫిలిం కావడంతో తన పాత్రకు సంబంధించిన 3D ప్రెజెంటేషన్ తీసుకొస్తే అది చూసి తన నిర్ణయం చెబుతానని నాగ్ ఆయాన్ కు చెప్పాడట.  డైరెక్టర్ అంత సీరియస్ గా లేడని అనుకున్నడట. కానీ మూడు నెలల తర్వాత 3D ప్రెజెంటేషన్ తీసుకొచ్చి నాగార్జునకు చూపించాడట.  దాంతో ఇంప్రెస్ అయిన నాగార్జున వెంటనే ఆయాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అరగంట కంటే తక్కువే ఉంటుందట.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ -  డింపుల్ కపాడియా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ ఫాంటసీ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట.  ఇది ఫస్ట్ పార్ట్ అని.. మరో రెండు పార్ట్స్ ప్లానింగ్ లో ఉన్నాయని సమాచారం.  ఇక నాగార్జున పార్ట్-2.. పార్ట్-3 లో నటించే విషయంలో ఇంకా డిసైడ్ కాలేదట.
Tags:    

Similar News