న్యూ ఇయర్‌ వేడుకలకు రష్మిక స్పెషల్‌ ప్లాన్స్‌

Update: 2020-12-31 03:40 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా ఈ ఏడాది సత్తా చాటింది. ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ ను దక్కించుకుంది. మరి కొన్ని భారీ సినిమాల్లో కూడా ఈమెకు ఈ ఏడాది ఆఫర్లు వచ్చాయి. దాంతో ఈ అమ్మడి కెరీర్‌ లో 2020 చాలా ప్రత్యేకమైనదిగా నిలిచి పోతుంది అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఇయర్‌ ఎండ్డింగ్‌ ను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేసి కొత్త ఇయర్‌ కు జోష్‌ గా స్వాగతం చెప్పాలనే ఉద్దేశ్యంతో ముద్దుగుమ్మ రష్మిక మందన్నా గోవాలో న్యూఇయర్‌ పార్టీకి వెళ్లింది.

సెలబ్రెటీలు న్యూ ఇయర్‌ పార్టీల కోసం దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. మన సౌత్‌ స్టార్స్‌ ఎక్కువగా మాల్దీవులు మరియు గోవాలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నారు. రష్మిక మందన్నా కూడా తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్‌ పార్టీ కోసం అంటూ గోవా వెళ్లింది. రెండు రోజుల పాటు అక్కడ స్నేహితులతో ఎంజాయ్ చేసి ఆ తర్వాత తిరిగి రాబోతుంది. గోవాలో న్యూ ఇయర్‌ పార్టీ కోసం ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కూడా చేరుకున్నారు. వారితో కాకుండా రష్మిక తన స్నేహితులతో వేరుగానే న్యూ ఇయర్‌ పార్టీని చేసుకోబోతుంది. హీరోయిన్‌ గా రష్మిక కెరీర్‌ చాలా ఆనందంగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ ఆఫర్‌ కూడా వచ్చింది. వచ్చే ఏడాది రష్మిక మరింత బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News