పాన్ ఇండియా సినిమాకే డేట్స్ ఇవ్వలేనంతగా..!
కన్నడ కస్తూరి రష్మిక మందన్న టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ గా మారింది. ఏ హీరో సినిమా మొదలైనా రష్మిక పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప`లో నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే రష్మికకు తెలుగులో మరో పాన్ ఇండియన్ స్థాయి మూవీలో నటించే ఛాన్స్ లభించిందని తెలిసింది.
అయితే డేట్స్ సమస్య కారణంగా ఆ మూవీని రష్మిక తిరస్కరించినట్టు తెలుస్తోంది. మలయాళ హాట్ త్రోబ్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి ఓ పిరియాడిక్ వార్ నేపథ్య లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వప్నాదత్ ఈ మూవీని నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేశారు.
మరో హీరోయిన్ గా రష్మికని అనుకున్నారట. అయితే డేట్స్ సమస్య తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకుందట. ఆమె స్థానంలో రాశిఖన్నాని తీసుకున్నారని తెలిసింది. దుల్కర్ సల్మాన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్న ఈ మూవీని ఓ యుద్ద నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారు.