హైదరాబాద్ వదిలి ముంబై ఛలో..
వివాదాల వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. అతడి నాలుకకు అడ్డే లేదు. తోచిందే చేస్తాడు. మొహమాట పడే ఛాన్సే లేదు. అప్పట్లో ముంబై నుంచి దుకాణం సర్ధేసి హైదరాబాద్ కి వచ్చేశాడు. ఇక్కడ వరుసగా తెలుగు సినిమాలు తీస్తూ బిజీ అయిపోయాడు. అయితే అతడు చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ లే. ఐస్ క్రీమ్ - అనుక్షణం లాంటి ఫ్లాప్ సినిమాల్ని తీశాడు. అయితే ఇంతకాలానికి సౌత్ లో ఓ కాన్ఫిడెంట్ మూవీ తీశానని ఫీలవుతున్నాడు వర్మ. ఇటీవలే కిల్లింగ్ వీరప్పన్ టీజర్ ని రిలీజ్ చేశాక కాన్ఫిడెంట్ గా హిట్ కొట్టేస్తున్నానన్న నమ్మకం పెరిగింది అతడికి. వీరప్పన్ టీజర్ కి బాలీవుడ్ ప్రముఖుల నుంచి చక్కని ప్రశంసలొచ్చాయి. అందుకేనేమో.. లేటెస్టు ట్వీట్ లో ఇక హైదరాబాద్ వదిలి ముంబై చెక్కేస్తున్నానని చెప్పాడు. జనవరి 1న కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ తర్వాత ఇక ఇక్కడ ఉండను. ముంబై వెళ్లిపోతున్నా. టాలీవుడ్ ని - పూరీని - చిరంజీవిపై ట్వీట్లను మిస్సయిపోతున్నానని వర్మ ట్వీటాడు.
అయితే వర్మ ఎలానూ టాలీవుడ్‌ని నాశనం చేసేశాడు. ఇక మళ్లీ మరోసారి హిందీ పరిశ్రమకి దాపురిస్తున్నాడని విమర్శకులు బాణాలు ఎక్కుపెడుతున్నారు. అక్కడ మరోసారి హార్డ్ హిట్టింగ్ మూవీస్ తెరకెక్కించి పాపులర్ అయిపోవాలని కలలు కంటున్నాడు. అయితే అన్ని కలలు నిజాలు కావు అన్న సంగతి త్వరలోనే తెలుసుకుంటాడని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అదీ మ్యాటరు.