రామ్ చరణ్ - శంకర్ 'గేమ్ ఛేంజర్'

Update: 2023-03-27 09:24 GMT
ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ తేజ్ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి రకరకాల పేర్లు ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చాయి.

అధికారి అని కామన్ మ్యాన్ అని ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చిన చివరికి ఈ సినిమాకి మరో ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా యూనిట్ ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా డైరెక్టర్ శంకర్ ఒక వీడియో విడుదల చేశారు.

ఈ టైటిల్ రివ్యూ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరి నిమిషం వరకు టైటిల్ రివ్యూ చేయకుండా చివరి నిమిషంలో ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా ప్రకటించింది సినిమా యూనిట్. ఇక గేమ్ ఛేంజర్ అని మూవీకి పేరు పెట్టిన యూనిట్.. ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక పాత్ర సరసన కియారా నటిస్తుంటే.. మరో పాత్ర సరసన అంజలి నటిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు లీకయ్యాయి. అందులో రామ్ చరణ్ ఒక పీరియాడిక్ లుక్ లో సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళుతున్న దృశ్యాలు కంటపడుతూ ఉండడంతో శంకర్ పెద్దగానే ప్లాన్ చేశారని అందరూ భావిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది కానీ ఒక పక్క ప్రభాస్ మరో పక్క మహేష్ సినిమాల సంక్రాంతికి కీ పడటంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Similar News