• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగ‌స్థ‌లంలో అవి కూడా...

రంగ‌స్థ‌లంలో అవి కూడా హిట్టే!

By - Tupaki Desk
Update: 2018-06-24 16:38 GMT
ఇప్ప‌టి సినిమాకు VFX ప్రాణం. సినిమా భాష‌లో చెప్పాలంటే... ట్వంటీ ఫిఫ్త్ క్రాప్ట్ అని అనొచ్చు. స్టార్ హీరోల సినిమా సీన్లు అత్యంత స‌హ‌జంగా రావ‌డానికి VFX  స‌హ‌కారం వ‌ర్ణించ‌లేనిది. గ్రాండియ‌ర్ చూపించాల‌న్నా, స‌హ‌జ‌త్వం చూపించాల‌న్నా దేనికైనా వీఎఫ్ ఎక్స్ ప‌ని సులువు చేస్తుంది. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల సెట్ల‌కు కోట్లు కోట్లు ఖ‌ర్చు అవుతున్నాయి. పైగా వాటిని వేసేట‌పుడు ఎంతో ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే... ఒక బిల్డింగ్ క‌ట్టినంత ప‌నే. ఇపుడు టెక్నాల‌జీ ఆ భారాన్ని చాలా త‌గ్గించింది.

మినిమ‌మ్ సెట్టింగ్స్ వేసుకుని బ్లూమాట్‌ లో కొన్ని షాట్స్ తీసుకుని VFX లో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఎంత స‌హ‌జంగా ఉంటున్నాయంటే ఏ సీన్‌లో గ్రాఫిక్స్ ఉందో క‌నిపెట్ట‌డం క‌ష్ట‌మే. మీరు రంగ‌స్థ‌లం చూసే ఉంటారుగా... అందులో రంగ‌మ్మ‌త్త‌- చిట్టిబాబు బోటు సీను బాగా పేలింది. ఆ సినిమా ఏ గోదావ‌రి జిల్లాల్లోనూ తీసి ఉంటార‌ని చాలామంది అనుకున్నారు. కానీ అది ఒక చిన్న సెట్ వేసి తీసి గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేశారు.  అంతేనా... చాలా సాధార‌ణంగా, స‌హ‌జంగా అనిపించి రాంచ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌కు కూడా గ్రాఫిక్స్ వాడారంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అరే ... చక్క‌టి ప్ర‌కృతి సీన్లు భ‌లే టైమింగ్‌తో తీశారే... ఎన్ని షాట్లుప‌డ్డాయో చాలా బాగా వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకుంటే... అది చాలా వ‌ర‌కు గ్రాఫిక్స్ అట‌. 

ఇంత‌కీ ఈ విష‌యాలు గాసిప్స్‌లా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వి కాదు...తాజాగా రంగస్థలం విజువల్ ఎఫెక్ట్స్ పై ఒక వీడియో రిలీజ్ చేశారు నిర్మాతలు. అందులో ఈ రెండు సీన్లు గ్రాఫిక్స్‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన‌ట్లు వెల్ల‌డ‌య్యింది.  ఇండ‌స్ట్రీని మ‌ళ్లీ ప‌ల్లె వైపు తీసుకెళ్లిన ఈ సినిమాలో VFX ఎంత కీల‌క పాత్ర పోషించిందో అర్థ‌మైందిగా!

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam Movie 
  • Rangasthalam VFX 
  • Telugu News 

Similar News

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS