బ్యూటిఫుల్ రకుల్ భలే ఫిలాసఫీ చెప్పిందే!

Update: 2019-08-07 13:35 GMT
రకులిజం అనే పదం ఎప్పుడైనా విన్నారా? విని ఉండరు లెండి. ఎందుకంటే  ఇంకా లేడీ సెలబ్రిటీలకు 'ఇజం'ను తగిలించే సహృదయం మన ప్రేక్షకులలో ఎందుకో రాలేదు.  అదే హీరోలలో ఇప్పటికే చాలామందికి ఈ ఇజాలు తగిలించారు.  త్వరలో ఎవరైనా ఫెమినిస్టులు.."ఏం హీరోలకేనా.. మా హీరోయిన్లకు ఇజాలు ఉండకూడదా?" అంటూ దీపికయిజం.. కత్రినాయిజం.. అలియాయిజం.. కంగనాయిజం అని బాలీవుడ్ లోనూ.. నయనిజం.. స్వీటీయిజం.. అంటూ సౌత్ లోనూ మొదలు పెడతారు.   ఏ ఇజానికి ఏం అర్థం ఉంటుందో దేవుడెరుగు... ఇజం తగిలిస్తే వారు పెద్ద సెలబ్రిటీల కింద లెక్క.

ఇప్పుడు ఈ ఇజం టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈమధ్య రకుల్ ఓ కొత్త లాజిక్ చెప్పింది.. ఇలాంటి నాలుగు లాజిక్కులను.. మరో ఐదు కొటేషన్లను కలిపితే రకులిజం అయిపోతుంది కదా?  సరే.. ఇంతకీ రకుల్ ఏం చెప్పిందయ్యా అంటే "ఫిలిం ఇండస్ట్రీ..  వారి ఆలోచనా విధానం గత రెండేళ్ళుగా మారుతున్నాయట."  రకుల్ ను "ఈమధ్య మీరు వయసు మళ్ళిన హీరోలతో జోడీ కడుతున్నారు.. వారి వయసులో మీకు సగం కూడా ఉండదు కదా.. ఎందుకలాగ?" అని ప్రశ్నిస్తే ఈ లాజిక్ చెప్పింది.  అంతేకాదు "అజయ్ దేవగణ్ సర్ తో 'దేదే ప్యార్ దే' సినిమాలో నటించిన తర్వాత సిద్ధార్థ్ తో 'మర్జావా' లో నటిస్తున్నాను.  నాగార్జున సర్ తో 'మన్మథుడు 2' లో నటించిన తర్వాత నితిన్ తో నటిస్తున్నా.  ఇదేం పెద్ద విషయం కాదు.. రెండేళ్ళ నుంచి అందరి ఆలోచనా విధానం మారుతోంది" అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ లాజిక్ చిన్మయి లాంటి వారికి మొదట్లో నచ్చలేదు.  ఇప్పుడేమో భర్త రాహుల్ రవీంద్రన్ సినిమా కాబట్టి మౌనంగా ఉంది.  అయినా రెమ్యూనరేషన్ భారీగా  తీసుకోవడం ముఖ్యం కానీ కుర్ర హీరో అయితేనే.. సీనియర్ సిటిజెన్ అయితేనేం.  ఆ విషయం చెప్పకుండా ఏదో ఒక తిమ్మినిబమ్మిని చేసే లాజిక్ చెప్తారు.. అయినా నెటిజన్లకు ఈ లాజిక్కులు అర్థం కావా ఏంటి?

    

Tags:    

Similar News