పవన్ తో సినిమాపై రాజమౌళి షాకిచ్చాడు

Update: 2020-04-20 11:10 GMT
దర్శకధీరుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని బాలీవుడ్ నుంచి కోలివుడ్ దాకా అందరూ స్టార్ హీరోలు పరితపిస్తుంటారు. కానీ కథను బట్టే హీరోలను ఎంపిక చేసుకుంటారు రాజమౌళి. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా ఎందుకు చేయడం లేదని ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడివీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

కరోనాతో క్వారంటైన్ లో రాజమౌళి వరుసగా టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాజాగా నేడు మరో టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి అడగగా ఆసక్తికరంగా స్పందించారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘గతంలో నేను ఆయన్ని కలిసి సినిమా గురించి మాట్లాడాను. ఐతే అది కుదరలేదు. ఇక ప్రస్తుతం పవన్ తో సినిమా చేయడం కుదరదు. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడం వల్ల తక్కువ సమయంలో సినిమా చేయాలంటారు. నేనేమో ఏళ్ల తరబడి సినిమాలు తీస్తాను. కాబట్టి ఆయనకు నాకు సెట్ కాదు’ అంటూ కుండబద్దలు కొట్టారు.

ఇక పవన్ లో సామాజిక సృహ ఎక్కువని... మీరూ మెసేజ్ లు ఇస్తారు.. ఇద్దరూ కలిస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది కదా అని ప్రశ్నించగా.. రాజమౌళి ఈ వ్యాఖ్యలను ఖండించారు. పవన్ తో నన్ను పోల్చకండి అని స్పష్టం చేశారు. సామాజిక సేవలో పవన్ కు 100 మార్కులు పడితే.. తనకు కేవలం 0.5 మార్కులే వస్తాయని తెలిపారు. తనకు సినిమాలే లోకం అని స్పష్టం చేశారు.

దీంతో రాజమౌళి-పవన్ కళ్యాణ్ సినిమా ఇక ఉండదన్న విషయం స్పష్టమైంది. కలలో కూడా ఊహించడానికి వీరి కాంబినేషన్ సెట్ అవ్వదని రాజమౌళి కుండబద్దలు కొట్టారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లోనూ నిరాశ ఎదురైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News