రాధేశ్యామ్ క్రిస్మస్ టార్గెట్
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయడంతో పాటు జనవరిలోనే మరో సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. అందుకే డిసెంబర్ లోనే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం చకచక చిత్రీకరణ జరుపుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 25 వరకు అంటే క్రిస్మస్ వరకు షూటింగ్ ను ముగించాలనే భావిస్తున్నారట. క్రిస్మస్ వరకు రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి అదే రోజున షూటింగ్ కంప్లీట్ అయిన అప్ డేట్ ను ఇవ్వాలని దర్శకుడు భావిస్తున్నాడు.
సాహో విడుదలకు ముందు నుండి రాధేశ్యామ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పలు సీన్స్ నభూతో అన్నట్లుగా ఉంటాయని మేకర్స్ చేబుతున్నారు. అత్యాధునిక కెమెరాను.. లెన్స్ ను ఉపయోగిస్తున్న మేకర్స్ ప్రభాస్ ను మరింత అందంగా చూపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.