కేజీఎఫ్ డైరెక్టర్ కోసం ప్రభాస్ భారీ కసరత్తు..!!

Update: 2020-12-30 15:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సలార్ మూవీకోసం రెడీ అవుతున్నాడు. రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ముగించుకొని త్వరలోనే సలార్ బృందంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చివరి దశలో ఉండగా.. డార్లింగ్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. కేజీఎఫ్ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్..  డార్లింగ్ ప్రభాస్ ని మాస్ లుక్కులో చూపించనున్నాడు. అయితే సలార్ అని ఆల్రెడీ టైటిల్ ప్రకటించడంతో జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. అయితే సలార్ సినిమాలో పాత్ర కోసం డార్లింగ్ కండలు తిరిగిన దేహదారుడ్యంతో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పోస్టర్ లో ప్రభాస్ ఎలాంటి రఫ్ లుక్కులో దర్శనమిచ్చాడో తెలిసిందే.

అయితే మాఫియా నేపథ్యంలో ఇదివరకు చూపించని వయోలెన్స్, యాక్షన్ చూపిస్తారని టాక్. సలార్ సినిమా షూటింగ్ 2021 సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తారట. అంతేగాక ప్రశాంత్ - ప్రభాస్ ఈ సలార్ మూవీని కేవలం నాలుగు నెలలలో పూర్తి చేయాలని అనుకుంటున్న వార్త ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక సలార్ మూవీని దసరా పండుగ వరకు విడుదలకు సిద్ధం చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సలార్ లో ప్రభాస్ లుక్కు ఎలా ఉండబోతుందో ఎవరికీ వారు అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ప్రశాంత్ టీమ్ త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ ఇవ్వనుందట. ప్రభాస్ ప్రస్తుతం సలార్ కోసం ఫిట్ అండ్ ఫెయిర్ గా రెడీ అవ్వడానికి కష్టపడుతున్నాడట. అంతేగాక శారీరకంగా, మానసికంగా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి హీరోయిజం ఎలివేషన్స్ ఓ రేంజిలో చూపించే ప్రశాంత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేయనున్నాడు.
Tags:    

Similar News