కరోనా వల్ల పవన్ 27లో మార్పులు?
కరోనా కారణంగా సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్ని భాషల.. ప్రాంతాల సినీ నిర్మాణ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఇబ్బందులు తప్పవు అంటున్నారు. టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ చేస్తూ ఉంటారు. అయితే రాబోయే కొన్ని నెలల వరకు విదేశాలకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే ఉద్దేశ్యంతో ఫిల్మ్ మేకర్స్ విదేశీ షెడ్యూల్స్ ను మార్చుతున్నారు.
పవన్ కళ్యాణ్ 27వ చిత్రం విరూపాక్ష సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను మొరాకో దేశంలో చిత్రీకరించాలని దర్శకుడు క్రిష్ భావించాడు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో చిత్రీకరణ వద్దని పవన్ కళ్యాణ్ సూచించడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి హైదరాబాద్ లోనే సెట్టింగ్స్ ఏర్పాటు చేసి షూటింగ్ చేయాలని క్రిష్ నిర్ణయించుకున్నాడట. విదేశాల్లో చిత్రీకరణ పెట్టుకుంటే సినిమా ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి.
లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పవన్ కళ్యాణ్ 27వ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతుంది. తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్ ఉన్నాడు. ఇంత తక్కువ సమయంలో విదేశాల్లో షెడ్యూల్ వీలు పడదని.. అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా కొంత మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించాలనే నిర్ణయానికి వచ్చాడు. పవన్ కూడా అందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగమ్మను పరిశీలిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రకు గాను అనుష్కను క్రిష్ సంప్రదించాడనే వార్తలు కూడా వస్తున్నాయి. పవన్ లేకుండా ఇప్పటికే కొన్ని సీన్స్ ను చిత్రీకరించిన క్రిష్ పవన్ తో తదుపరి షెడ్యూల్ పూర్తి చేయబోతున్నాడు. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.