ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్నదంతా పోతుందని హాట్ బ్యూటీ ఆందోళన

Update: 2020-12-31 07:30 GMT
సోషల్‌ మీడియా సెన్షేషన్‌ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమద్య పెళ్లి చేసుకుని వార్తల్లో సందడి చేసిన ఈ అమ్మడు కేవలం నెల అంటే నెల రోజులు కూడా గడవక ముందే పోలీసుల వద్దకు వెళ్లి నా భర్త వేదింపులకు పాల్పడుతున్నాడు అంటూ భర్తను అరెస్ట్‌ చేయించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అతడు చాలా బాధ పడుతున్నాడు. అతడు తప్పు చేశాను అంటూ ఒప్పుకున్నాడు. అందుకే ఆయనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకుంటున్నాను అంటూ పేర్కొంది. మొత్తానికి కొన్ని రోజుల పాటు మీడియాలో హడావుడి చేసింది. ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చింది.

పూనమ్‌ పాండే కు ఇన్‌ స్టా గ్రామ్‌ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని ద్వారా ఆమెకు ఆదాయం కూడా బాగా వస్తుందనే టాక్ ఉంది. అలాంటి అకౌంట్ హ్యాక్ అవ్వడంతో ఆమె షాక్‌ కు గురైంది. ఎప్పటిలాగే నేను నా అకౌంట్‌ ను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం అవ్వడం లేదు. నా అకౌంట్ ను ఎవరో హ్యాక్‌ చేశారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఏమవుతారో అనే ఆందోళన వ్యక్తం చేసింది. ట్విట్టర్‌ ద్వారా తన ఫాలోవర్స్ కు సందేశాన్ని ఇచ్చింది. నేను ఇన్‌ స్టా లో షేర్‌ చేసినట్లుగా ఏమైనా మెసేజ్ లు వస్తే రిప్లై ఇవ్వవద్దు. తాను ఇన్ స్టా గ్రామ్‌ వారితో మాట్లాడి నా అకౌంట్ ను వెనక్కు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాను అంది.
Tags:    

Similar News