కోలీవుడ్లో రాజకీయ గాలి!!
తమిళనాట రాజకీయాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయి అనటంలో అతిశయోక్తి లేదు. అటు జయలలిత మృతి తరువాత జరిగిన కొన్ని గొడవల నుండి మొన్నటికి మొన్న రజిని పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పడం వరకు మనం చాలానే విన్నాం. అటు బాక్స్ ఆఫీస్ వద్ద చూసినా కమర్షియల్ సినిమాలకంటే పొలిటికల్ సినిమాలు హిట్లు సాధిస్తున్నాయి.
అందుకే కాబోలు స్టార్ హీరోలు సైతం అలాంటి సినిమాలు చేయడంపై మొగ్గు చూపుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ అనే టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో హీరో ఒక పెద్దింటి కుటుంబం నుండి వచ్చి పేద వాళ్లకు అండగా నిలబడతాడట. ఈ కాన్సెప్ట్ ఇప్పటికే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో మనం చూసేశాం. అటు సూర్య కూడా ఎన్ జి కె అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చే గువేర లాంటి లుక్స్ చూస్తేనే ఇది పొలిటికల్ సినిమా అని అర్థమయిపోతోంది. చివరకి రజినీకాంత్ కూడా కబాలి - కాలా అని రాజకీయాలపై సినిమాలు చేశారు. చూస్తూ ఉంటే తమిళనాట పొలిటికల్ గాలి బాగా సోకింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.