2021 NYE ట్రీట్.. బోయ్ ఫ్రెండ్ తో పాయ‌ల్ చిలౌట్

Update: 2020-12-30 05:56 GMT
స్కూల్ డేస్ .. కాలేజ్ డేస్  జాలీడేస్ ని పాయ‌ల్ మ‌ర్చిపోలేక‌పోతోంది. కాలేజ్ ఏజ్ లో బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేసిన‌ తీపి జ్ఞాప‌కాలు ఆర్.ఎక్స్ బాంబ్ పాయ‌ల్ కి బోలెడ‌న్ని. అయితే అవేవీ చెప్ప‌కుండా దాచేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా లేన‌ని చాలా కాలంగా హింట్ ఇస్తూనే ఉంది.

2020 వేలెంటైన్స్ డే రోజున పాయ‌ల్ ప్రేమాయ‌ణానికి సంబంధించిన సింప్ట‌మ్స్ కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. పాయ‌ల్ రాజ్ పుత్ సోష‌ల్ మీడియాల్లో దిల్లీలో చ‌దువుకునే రోజుల్లో క్లాస్ మేట్  సౌర‌బ్ థింగ్రా తో స్నేహం చేసింది. కొంత‌కాలంగా సౌర‌బ్ తో పాయ‌ల్ చెలిమికి అనుబంధానికి సంబంధించిన ఫోటో లీకులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నా.. తాను ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని మాత్రం ఎందుక‌నో బ‌య‌ట పెట్ట‌డం లేదు పాయ‌ల్.

నిజానికి పాయ‌ల్ .. సౌర‌బ్ స్కూల్ డేస్ నుంచే స్నేహితులు అని ఇటీవ‌ల తెలిసింది. ఒకే స్కూల్లో ఒకే క్లాస్ అయినా ఆ ఇద్ద‌రి బ్యాచ్ లు వేర‌ట‌. ప‌లుమార్లు ఇలా జాలీగా ఫోటోషూట్ల‌కు ఫోజులిచ్చారు ఈ జంట‌. ఇంత‌కీ ఇది ఎక్క‌డ‌?  చూస్తుంటే కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెడుతున్న వేళ ఇలా సిటీ ఔట‌ర్ లో రిసార్ట్ ఫెస్టివ‌ల్ లో అని భావించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News