#నిహారిక పెళ్లి.. ప్రయివేట్ జెట్ లో బయల్దేరిన వవర్ స్టార్
ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో మెగా వెడ్డింగ్ సంబరాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ సోమవారం ఉదయమే నిహారిక - చైతన్య జంట ఇరు కుటుంబాలు ప్రయివేట్ విమానంలో ఉదయ్ పూర్ కి వెళ్లారు. సాయంత్రానికే అథులంతా ఉదయ్ పూర్ (రాజస్థాన్) లోని వెన్యూకి చేరుకోవడంతో అక్కడ పెళ్లి సందడి ఓ రేంజులోనే కనిపిస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్ .. వైష్ణవ్ తేజ్ .. ఇలా మెగా హీరోలంతా వెన్యూ వద్ద సందడి చేయడం చూస్తున్నదే. ఇక ఎందరు ఉన్నా.. అక్కడ ఇంకేదో మిస్సయ్యిందని మెగాభిమానులు భావిస్తున్నారు.
నిహారిక పెళ్లికి రెండ్రోజుల ముందే పవన్ విచ్చేస్తారని గుసగుసలు వినిపించగా ఆయన ఇప్పటివరకూ వెళ్లలేదు. నిన్న రైతుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ధీక్షలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ నేటి(మంగళవారం) సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయివేట్ జెట్ లో నిహారిక పెళ్లికి బయల్దేరారు. ప్రయివేట్ జెట్ ఉదయ్ పూర్ లో ల్యాండింగ్ అవ్వగానే పవన్ కి సంబంధించిన ఫోటోలు రివీల్ కానున్నాయని సమాచారం. పవన్ చేరికతో వెన్యూకి ప్రత్యేక కళ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.