ముందు త్రివిక్రమ్ సినిమాయే చేస్తున్నాడటగా...
ఎప్పుడైతే అసలు కాటమరాయుడు షూటింగ్ మధ్యలో ఉండగా మన పవర్ స్టార్ తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడో.. అప్పుడే అందరికీ ఒక సందేహం వచ్చేసింది. తన స్నేహితుడు కమ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడా లేదా అని. పైగా మాంత్రికుడు బౌండ్ స్ర్కిప్ట్ తో రెడీగా ఉన్నాడంట.. అందుకే అందరూ పవన్ ఆఫీస్ నుండి ఎటువంటి కబురు వినాల్సిస్తుందో అని వెయిట్ చేస్తున్నారు.
పవన్ కు అత్యంత సన్నిహితుడైన ఒక నిర్మాత.. అలాగే మరో నిర్మాత చెబుతున్న వివరాల ప్రకారం.. అసలు ముందు మనోడు త్రివిక్రమ్ సినిమాయే చేస్తాడట. అవును.. పేరుకు నీసన్ సినిమాను మొదలెట్టినా కూడా.. ఇప్పుడు పవన్ ఒకేసారి మూడు సినిమాల షూటింగులో పాల్గొనే ఛాన్సుందని టాక్. కాటమరాయుడు సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. ఈ రెండు నెలల్లో ఫినిష్ అయిపోయే ఛాన్సు కూడా ఉంది. అది పూర్తవ్వగానే జస్ట్ నాలుగు రోజులు నీసన్ తో వర్కు చేసి.. మనోడు డిసెంబర్ మొదటి వారం నుండి త్రివిక్రమ్ సినిమాలోకి జంప్ చేస్తాడట. ఆ తరువాత జనవరిలో మళ్లీ నీసన్ సినిమాను టచ్ చేస్తాడు అని చెబుతున్నారు.
పైగా ఇప్పటికే హారిక అండ్ హాసిన క్రియేషన్స్ వారు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు పోస్టర్లు కూడా వేసేశారు. ఈ తరుణంలో అది క్యాన్సిల్ అయ్యే ఛాన్సు లేదులే. పైగా చేసేది త్రివిక్రమ్ సినిమా. ఏకంగా జనసేన పబ్లిక్ స్పీచుల్లోనే తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి ప్రస్తావిస్తున్న పవన్.. చెప్పకుండా సినిమా వదిలేస్తాడా? లేదుగా!!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/