యంగ్ జనరేషన్ హీరోల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. అభిమానులు మా హీరో, మీ హీరో అని వేరు చేసి మాట్లాడుతుంటారు. అయితే హీరోలు మాత్రం అవన్నీ సినిమా వరకే తప్ప వ్యక్తిగతంగా కాదని నిరూపిస్తూ ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరవుతుంటారు. ఒకరి సినిమాకి మరొకరు సాయం చేసుకొంటుంటారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన `జల్సా`కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పారు. ఎన్టీఆర్ `బాద్ షా`కీ అలాగే మాట సాయం చేశాడు మహేష్. ఇప్పుడు ఇదే తరహాలో రామ్ చరణ్ సినిమాకి ఎన్టీఆర్ కూడా మాట సాయం చేయబోతున్నట్టు సమాచారం.
చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఓ అగ్ర హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పించాలనుకొన్నాడట శ్రీనువైట్ల. ఎవరైతే క్రేజీ ఉంటుందా అని భావించిన ఆయనకి ఎన్టీఆర్ పేరు తట్టిందట. వెంటనే ఆయన్ని సంప్రదించడం, ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. శ్రీనువైట్లకీ, ఎన్టీఆర్ కీ మంచి అనుబంధం ఉంది. ఇదివరకు ఇద్దరూ కలిసి `బాద్ షా` చేశారు. అలాగే ఎన్టీఆర్ కీ, రామ్ చరణ్ కీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. `బాద్ షా` సినిమాపై క్లాప్ కూడా చరణే కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో షికారుకెళ్లిపోయారు. అది చూసి అభిమానులు అప్పట్లో ఎంత ముచ్చటపడిపోయారో. ఇప్పుడు ఒకరి సినిమాలో మరొకరి వాయిస్ విని అదే స్థాయిలో ఆనందిస్తారనడంలో సందేహం లేదు. అయితే ఈ వాయిస్ ఓవర్ గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి `ఫైటర్` అనే పేరును ఫిక్స్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఇందులో చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. స్టంట్ మాస్టర్ అవతారంలో్ తన తండ్రి చిరంజీవితో పాటు, నాగార్జున, మరికొద్ది మంది కథానాయకులకు ఫైట్స్ కంపోజ్ చేసే సన్నివేశాల్లో చరణ్ కనిపిస్తారని సమాచారం. సెప్టెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.