నాకింకా ఇరవై ఒకటే -నాగార్జున

Update: 2015-08-29 07:19 GMT
నాన్న లేని లోటు వంద శాతం మాపై ఉంది. ఆయన లేకుండానే అన్నపూర్ణ స్టూడియోకి వెళుతుంటే.. ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన చివరిసారిగా నటించిన 'మనం' సెట్స్‌ కి వెళ్లినప్పుడు అక్కడ ఆయన నవ్వులు చిందిస్తున్నట్టే కనిపిస్తుంది. ఆటోమెటిగ్గా నా మొహంలోనూ నవ్వు వచ్చేస్తుంటుంది. అలా నవ్వుతూనే బతకాలనిపిస్తుంటుంది... అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు నాగార్జున. ఈరోజు నాగ్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా చాలా సంగతులే చెప్పారు.

=నాన్న లాంటి మంచి ఫాదర్‌ దొరకరు. ఆయన నా తండ్రి కావడం లక్కీ. నా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఒకవేళ నటుడిగా నాన్నగారు బెటరా? మీరు బెటరా? అని అడిగిఏ ఏం చెబుతాను. నాన్నగారే అని చెబుతా. ఆయన పెంపకం కూడా అంతే.

=నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో అలాగే నేను కూడా నా పిల్లల్ని పెంచుతున్నా. గైడెన్స్‌ చేస్తా కానీ ఇంటర్‌ ఫియర్‌ కాను.

=దెయ్యాలంటే నమ్మకం ఉందా? అంటే లేదనే చెబుతా. ఇంతవరకూ నాకు అలాంటి అనుభవం కలగలేదు. అయితే ఇది తెలుగు సినిమాల్లో వర్కవుటయ్యే ఫార్ములా. అనీల్‌ కల్యాణ్‌ కాన్ఫిడెంటుగా తీస్తున్నాడు.

=నేను నటించిన రాజన్న, గగనం, మనం చిత్రాలు ప్రయోగాలు అని అనుకోను. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో ఎప్పుడో రిలీజైన ఫ్రెంచ్‌ సినిమా రీమేక్‌ లో నటిస్తున్నా. పూర్తిగా ప్యారలైజ్డ్‌ పర్సన్‌ గా కనిపిస్తా. దీనిని ప్రయోగం అంటారా? నేనైతే జనాలకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటా.

=రాజకీయాలపై ఆసక్తిలేదు. టైమ్‌ అసలే లేదు. కానీ ఫాలో అవుతుంటా.
Tags:    

Similar News