అల్లరి సమంత.. చైతూను ఒప్పించి..

Update: 2017-05-27 09:30 GMT
సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సరదా కామెంట్లు చేస్తూ.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది సామ్. అందుకే ఆమెను 30 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. సమంత అల్లరిని వీళ్లందరూ భలేగా ఎంజాయ్ చేస్తుంటారు. ఐతే సమంత వరించిన వాడు మాత్రం ఆమెకు పూర్తి భిన్నం. రిజర్వ్డ్ గా ఉండే నాగచైతన్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. తన పర్సనల్ థింగ్స్ ఏవీ జనాలతో పెద్దగా షేర్ చేసుకోడు. బయట కూడా అక్కినేని కుర్రాడు సైలెంటుగా ఉంటాడు. అలాగని సమంత ఊరుకుంటుందా? ఎందుకూరుకుంటుంది..? చైతూను కూడా తన దారిలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

ఆ మధ్య చైతూ వంట చేస్తుండగా.. అతడికి తెలియకుండా ఫొటోలు తీయడమే కాదు.. వాటిని సోషల్ మీడియాలోనూ షేర్ చేసేసింది సామ్. ఈ సంగతి తనకు తెలియదని చైతూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో పాటుగా మరికొన్న ఫొటోలు.. వీడియోలు కూడా బయటికి వచ్చాయి. తాజాగా చైతూ జిమ్ వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది సమంత. ఈసారి మాత్రం చైతూకు తెలిసే వీడియో షేర్ చేసిందట సమంత. ఎంతో చెప్పాక కానీ.. చైతూ కన్విన్స్ అవ్వలేదని.. తర్వాతే ఈ వీడియో పోస్ట్ చేశానని అంది సామ్. చైతూ 161 కిలోల వెయిట్స్ మోస్తూ కనిపించాడు ఈ వీడియోలో. దీంతో పాటు సమంత కూడా తాను బరువులు మోస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. అందులో సమంత కూడా తన స్థాయిలో బాగానే బాగానే బరువులెత్తి తన స్టామినా చూపించిందిలెండి.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News