చైతన్య.. అఖిల్.. అంతా అఫీషియలే!!

Update: 2016-08-29 11:30 GMT
ఇప్పుడు నాగ చైతన్య అండ్ బ్రదర్ అఖిల్ గురించి సీక్రెటుగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైతే పేరెంట్స్ కూడా వారిని దగ్గరకు తీసుకుని.. నా పిల్లల సెలక్షన్ ఇదే అని వారిని ఎండార్స్ చేస్తున్నారో.. అందులో ఇంకా దాచేదేముంటుంది చెప్పండి?

హైదరాబాద్ లో జరిగిన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి మ్యారేజ్.. తదనంతర పార్టీల సాక్షిగా.. ఇప్పుడు హీరోయిన్ సమంత అండ్ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ వరల్డ్ ఫ్యామస్ అయిపోయారు. ఎప్పుడైతే కింగ్ నాగార్జున సమంతను దగ్గరకు తీసుకుని.. అందరికీ పరిచయం చేస్తున్నారో.. అప్పుడే ఆయన తన కోడలను అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని అర్ధమైపోయింది. అలాగే శ్రీయ భూపాల్ తో కలసి కుర్రాడు అఖిల్.. ఇతర సెలబ్రిటీలకు ఫోటోలకు ఫోజులిచ్చాడో.. అప్పుడే తన ఛాయిస్ కూడా ఓపెన్ గా చెప్పేసినట్లయ్యింది. ఆ లెక్కన ఇక అక్కినేని ఫ్యామిలీలో జరగబోయే రెండు బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ గురించి పెద్దగా దాస్తున్నదేముంది.. అంతా అఫీషియలే.

అయితే ఇప్పుడు అక్కినేని అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే.. ఎలాగో ఓపెన్ గా అంతా తెలిసిపోయింది కాబట్టి.. మళ్లీ మళ్లీ మీడియవాళ్లు ఇటు సమంతను, అటు అఖిల్ ను, ఆ తరువాత చైతన్యను గుచ్చిగుచ్చి ఈ పర్సనల్ లైఫ్‌ గురించి అడగకుండా ఉంటే బాగుంటుందని వారి ఫీలింగ్. అదీ నిజమే కదా.. అంతా ఓపెన్ గా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ వారిని కామెంట్ చేయమనడం ఎందుకులే!!

Tags:    

Similar News