విజయ్ దేవరకొండ పై మిస్ ఇండియా ఫోకస్

Update: 2022-07-24 12:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే గట్టిగానే పెంచుకుంటున్నాడు. ఇటీవల కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో కొంతమంది నటీనటులు విజయ్ దేవరకొండ పై ఎక్కువగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలతోనే భారీ స్థాయిలో విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో అతను చాలా తొందరగానే అక్కడ సెలబ్రిటీలకు కనెక్ట్ అవుతూ ఉండడం విశేషం.

ఇప్పటికే చాలామంది అగ్ర నటి నటులు కూడా విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని అతనితో నటించాలని ఉంది అని కూడా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే అతనిపై క్రష్ ఉందని కూడా తెలియజేయడం విశేషం. ఆ మధ్య కాలంలో తెలుగులో తనకు ఇష్టమైనటువంటి నటుడు విజయ్ దేవరకొండ అని జాన్వికపూర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అతనితో కలిసి నటిస్తానని కూడా ఈ బ్యూటీ తెలియజేసింది.

అయితే రీసెంట్ గా మిస్ ఇండియా సినీ శెట్టి కూడా విజయ్ దేవరకొండ పై స్పందించిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. సినీ శెట్టి ఇష్టమైన నటీనటుల గురించి చెబుతూ తెలుగులో అయితే విజయ్ దేవరకొండ చాలా ఇష్టమని భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా అతని కలుస్తానని కూడా తెలియజేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే షారుక్ ఖాన్ ఇష్టమని సినీ శెట్టి తెలియజేసింది.

ప్రస్తుతం లైగర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే బాలీవుడ్ అగ్ర ప్రముఖ నటీనటులు మాత్రమే కాకుండా మిస్ ఇండియా కూడా రౌడీ స్టార్ అంటే ఇష్టమని తెలియజేయడంతో రౌడీ స్టార్ రేంజ్ మరో రేంజ్ కు పెరిగిపోతుంది అని చెప్పవచ్చు. మరి ఈ క్రేజ్ తో విజయ్ దేవరకొండ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News