రివ్యూలకు మెగాస్టార్ స్వీట్ కౌంటర్

Update: 2023-01-23 12:00 GMT
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వచ్చి వసూళ్లలో దుమ్ము లేపుతోంది. మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో జోరుగా వసూళ్లు రాబడుతోంది. 89 కోట్ల బ్రేక్ ఇవెన్ తో సంక్రాంతి రేసులో నిల్చున్న ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.  ఇక పండగ సీజన్ అయిన తర్వాత కూడా మంచి కలెక్షన్లతో థియేట్స్ లో ప్రదర్శితమవుతోంది వాల్తేరు వీరయ్య.

అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా వాల్తేరు వీరయ్య మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకు మొదట్లో కొంత మంది క్రిటిక్స్ నుంచి యూఎస్ లో అంతగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ఈ సినిమాకు మరీ నాసిరకమైన రేటింగ్ వచ్చింది.

కేవలం 2.25-2.5 రేటింగ్ లు రావడంతో మూవీ టీమ్ కొంత నొచ్చుకుందనే చెప్పాలి. అయితే రాన్రాను వాల్తేరు వీరయ్య కలెక్షన్లు ఊపందుకున్నాయి. వీర సింహారెడ్డి పూర్తిగా రక్తపాతం ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ వాల్తేరు వీరయ్యకే జై కొట్టారు. అలా చిరు నటించిన సినిమా యూఎస్ లో మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే తాజాగా యూఎస్ అభిమానులతో మెగాస్టార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

యూఎస్ లో అభిమానులతో జరిగిన ఈ మీటింగ్ లో చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు యూఎస్ మార్కెట్ నుండి కేవలం 2.25-2.5 రేటింగ్ లు వచ్చింది. అయినా తర్వాత ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది.

దీనిపై చిరు చేసి వ్యాఖ్యలు అభిమానులను ఉర్రూతలూగించాయి. వాల్తేరు వీరయ్యకు యూఎస్ లో కేవలం 2.25-2.5 రేటింగ్ లు ఇచ్చారని, 2.25 ను రేటింగ్ గా భావించి అంతా నిరాశకు గురయ్యారని అయితే 2.25 మిలియన్ల డాలర్ల రెవెన్యూ అని అర్థం చేసుకోలేకపోయామని చిరు అన్నారు.

వాల్తేరు వీరయ్య అటు నైజాం ఏరియాలోనూ డిస్టిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చి పెడుతోంది. సీడెడ్ లో బ్రేక్ ఇవెన్ క్రాస్ చేసింది. గోదావరి జిల్లాల్లో లాభాల్లో దూసుకుపోతోంది. గుంటూరులోని బ్రేక్ ఇవెన్ కు దగ్గరలో ఉంది. కృష్ణా, కర్ణాటక సహా మిగతా ప్రాంతాల్లో బ్రేక్ ఇవెన్ సాధించి లాభాల్లో దూసుకుపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News