గ్యాంగ్ లీడర్ చేతిలో పెరిగిన చిన్నారి ప్రిన్సెస్ నిహారిక
ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ఆ బుడ్డి ప్రిన్సెస్ ఎవరో గుర్తు పట్టారా? తనే కాబోయే వధువు నిహారిక. చిరు చేతిలోనే అల్లారు ముద్దుగా పెరిగింది. ఇప్పుడు ఓ అయ్య చేతిలో పెడుతున్నందుకు మెగాస్టార్ ఎంతో ఎమోషన్ అవుతున్నారు. ఇదివరకూ నిహారిక తన పెదనాన్నగారు చిరంజీవితో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశారు. నిహారికను పెళ్లికూతురిని చేసినప్పటి ఆ ఫోటో ఆల్బమ్ కే ప్రత్యేక శోభను తెచ్చింది.
ఇప్పుడు మరో అరుదైన ఫోటోని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ``మా చేతిలో పెరిగిన చిన్నారి నిహారికను చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో.. ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు.. ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యు నిశ్చయ్ వెడ్డింగ్..`` అంటూ దీవెనలు అందించి ఆనందం వ్యక్తం చేశారు. నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఫోటో చూస్తుంటే గ్యాంగ్ లీడర్ డేస్ ని చిరు తిరిగి గుర్తు చేశారు. ఆయన అప్పటికి యువకుడిగా ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాతా 65 వయసులోనూ అంతే ఎనర్జిటిక్ గా నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్యలో విభిన్నమైన ఆహార్యం గెటప్పులతో సర్ ప్రైజ్ చేయబోతున్నారు.