యంగ్ హీరో నోట .. 'అల్లుడుగారు' రీమేక్ మాట!
మంచు విష్ణు ఒక వైపున కథానాయకుడిగా .. మరో వైపున నిర్మాతగా ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన నుంచి 'మోసగాళ్లు' సినిమా రానుంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్ణు బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ముందుగా ఈ సినిమాను హాలీవుడ్ లోనే చేయాలని అనుకున్నాము .. ఆ తరువాత పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని భావించాము. ఈ కారణంగానే ఈ సినిమాపై ఎక్కువ బడ్జెట్ పెట్టవలసి వచ్చింది.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ అని అనుకుంటారు .. కానీ ఆమె ఇందులో నాకు అక్కగా కనిపించనుంది. ఆమె ఎంత మాత్రం అభ్యంతర పెట్టకుండా ఈ రోల్ చేయడానికి అంగీకరించింది. కాజల్ పాత్రను గురించి బయటికి చెప్పవద్దని చాలామంది అన్నారు. కానీ రివీల్ చేయడమే మంచిదని భావించి నేను చెప్పేశాను. అక్కా తమ్ముళ్లుగా మేము తెరపై కనిపిస్తాము. నాన్నగారికి ఈ కథ చాలా బాగా నచ్చింది ... అయితే ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఆయనకి నచ్చలేదు. కానీ ఈ మాత్రం రిస్క్ చేయకపోతే కష్టం. ఇక్కడ అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే ఎవరైనా సరే రిస్క్ చేయవలసిందే. లేకపోతే నెగ్గుకురావడం కష్టం.
నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం .. ఆయన టెంపర్ నాకు రాలేదు. నాన్నగారి కోపం వలన ఆయన నష్టపోయారేగానీ, వేరేవారెవరూ నష్టపోలేదు. అలాగే నాన్నగారు ముక్కుసూటి మనిషి .. ఏ విషయమైనా ముఖం మీదనే చెప్పేస్తారు. అదే విషయాన్ని కాస్త సున్నితంగాను చెప్పవచ్చని నేను తెలుసుకున్నాను. నాన్నగారు చేసిన అన్ని సినిమాలూ నాకు ఇష్టమే .. అన్నింటిలో 'అల్లుడుగారు' అంటే మరీ ఇష్టం. ఆ సినిమా రీమేక్ లో చేయాలనుంది. ఇక చరణ్ చేయకపోతే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీమేక్ లో నేను చేసేస్తాను. చరణ్ ఆలస్యం చేస్తే గనుక .. నేను చేయడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చాడు.