పది పరీక్షలు పూర్తిగా రద్దుకు హీరో మంచు విష్ణు డిమాండ్.. ఎందుకంటే..?
సినీనటుడు మంచు విష్ణు సంచలన డిమాండ్ చేశాడు. ఇంకా ఎదగని.. చిన్న వయసులో తలభారం ఉండేలా పరీక్షలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏకంగా పదో తరగతి బోర్డు పరీక్షలనే రద్దు చేయాలని కోరాడు. ఆ పరీక్ష విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై సోమవారం విష్ణు ట్వీట్ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని నేను బలంగా కోరుకుంటున్నా. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్విటర్‌లో ప్రశ్నించారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్లు విష్ణుకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు విభేదిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. సీబీఎస్‌ఈ పరిధిలోని 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ ఇవ్వాలని మంచు విష్ణు ఉద్దేశం.