సోషల్ మీడియాలో కొత్త మైలురాయి చేరిన మహేష్
సౌత్ హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలను గతంలో ఉత్తరాది ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత వచ్చిన పలు సినిమాలు కూడా తెలుగు సినిమాల ఖ్యాతిని అక్కడ పెంచుతూనే వచ్చాయి. అందుకే ఉత్తరాది సినీ ప్రేమికులు తెలుగు సినిమాలను మరియు హీరోలను ఆధరించడం అభిమానించడం మొదలు పెట్టారు. తెలుగు స్టార్స్ ను ఉత్తరాది జనాలు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అవుతున్నారు. ప్రభాస్.. విజయ్ దేవరకొండలు ఉత్తరాధిన మంచి ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబుకు కూడా హిందీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికే మహేష్ ట్విట్టర్ అకౌంట్ ను 11.2 మిలియన్ ల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఇన్ స్టా లో మహేష్ బాబుకు 6.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్ లో ఏకంగా 14 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే మహేష్ బాబు అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ 14 మిలియన్ ల ఫాలోవర్స్ సంఖ్యను చేరుకుంది. వచ్చే ఏడాది లో రాజమౌళితో మహేష్ బాబు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ సమయంలో మహేష్ బాబు ఉత్తరాదిన మరింత స్టార్ డం దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు సోషల్ మీడియాలో మహేష్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.