• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమికుల రోజు...

ప్రేమికుల రోజు సందర్బంగా...!

By - Tupaki Desk
Update: 2020-02-13 07:00 GMT
వాలెంటైన్స్‌ డే సందర్బంగా టాలీవుడ్‌ లో ఓ రేంజ్‌ లో సందడి కనిపించబోతుంది. రేపు ప్రేమికుల రోజు సందర్బంగా విజయ్‌ దేవరకొండ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు సర్వర్‌ సుందరం మరియు ఒక చిన్న విరామం అనే చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా రేపు పలు సినిమాలకు సంబంధించిన పాటలు మరియు ఫస్ట్‌ లుక్‌ లు మేకింగ్‌ వీడియోలు.. థీమ్‌ మ్యూజిక్‌ లు రాబోతున్నాయి.

ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’ సర్‌ ప్రైజ్‌ వీడియో. శేఖర్‌ కమ్ముల కాస్త గ్యాప్‌ తీసుకుని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా తెరకెక్కించిన లవ్‌ స్టోరీ చిత్రంకు సంబంధించిన సర్‌ ప్రైజ్‌ ను రేపు రివీల్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ప్రేమికుల రోజు సందర్బంగా సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా నుండి సింగిల్స్‌ గురించి ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రకటించాడు.

రేపు నితిన్‌ భీష్మ నుండి కూడా సింగిల్స్‌ కు సంబంధించిన ఒక పాటను విడుదల చేయబోతున్నట్లు గా చెబుతున్నారు. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక సందీప్‌ కిషన్‌ ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ సినిమాకు సంబంధించి కూడా ఒక పాటను విడుదల చేయబోతున్నారు. మొత్తానికి రేపు ప్రేమికుల రోజును తెలుగు ప్రేక్షకులు వీటితో తెగ ఎంజాయ్‌ చేయవచ్చు అన్నమాట.
Tags:    
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

2026-11-10 06:01 GMT

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

2026-11-10 06:00 GMT

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

Copyright @2026

Powered by Blink CMS