అలా ఫోజులిస్తే లెస్బియనే అంటారా?

Update: 2017-03-23 08:08 GMT
ఒక మోడల్ గా ఎదుగుతున్న క్రమంలో.. అనేకానేక ఫోటో షూట్లలో పాల్గొనాల్సి వస్తుంది. సరిగ్గా బ్రిటీష్‌ బాంబ్ యామీ జాక్సన్ కూడా అదే చేసింది. లో దుస్తుల్లో మెరవడం నుండి న్యూడ్ గా ఫోజులివ్వడం వరకు అన్నీ చేసింది. ఒక్కోసారి గ్రూప్ ఫోటో షూట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఐశ్వర్య రాయ్ వంటి అందగత్తెలు కూడా ఈ గుంపులో గోవిందం షూట్లు అనేకానేకం చేశారు.

అయితే మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి యామీ జాక్సన్ న్యూడ్ గా ఫోజులిచ్చిన ఒక ఫోటోను చూసి.. ఆమె లెస్బియన్ అంటూ నెట్టింట్లో చాలా దుమారం రేగుతోంది. కేవలం న్యూడ్ గా మరో ఇద్దరమ్మాయిలతో హత్తుకుని ఫోజులిస్తే.. వారిని లెస్బియన్ అనేస్తామా? అంటే గతంలో రణవీర్ సింగ్ వంటి స్టార్లు ఇద్దరు ఇద్దరమ్మాయిలతో గ్రూపుగా సెక్సీ షూట్ చేశారు.. అందుకని వారు సామూహికంగా శృంగారం చేస్తున్నారని అంటామా? అబ్బాయితో అబ్బాయి దగ్గరగా ఉంటే గే అని.. అమ్మాయితో అమ్మాయి దగ్గరా ఉంటే లెస్బియన్ అని అనేస్తున్నారు మన జనాలు. కాని అసలు సిసలైన స్నేహితులెవరైనా అలా ఫోజులు ఇస్తే.. అప్పుడు కూడా ఇవే మాటలు మాట్లాడితే.. అవతలి వారి మనస్సు బాగా హర్టవుతుంది. అలాగే ఒకవేళ వారు నిజంగానే గే లేదా లెస్బియన్ అయినా కూడా అలాగే హర్టవుతారు.

బహుశా సెక్సువల్ ఓరియెంటేషన్ అనే సున్నితమైన అంశంపై సరైన అవగాహన లేకనే మన నెటిజన్లు ఇలాంటి చెత్త కామెడీ చేస్తున్నారని అనుకోవాలి. వీరి అత్యవసరంగా అవగాహన కలిపించాల్సిన ఆవశ్యకత ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News