బ‌యోపిక్‌ లో ఎన్టీఆర్ లేన‌ట్టే!

Update: 2018-10-26 04:12 GMT
ప్ర‌తిష్టాత్మ‌క `ఎన్టీఆర్` బ‌యోపిక్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ ని ఎన్టీఆర్-క‌థానాయ‌కుడు - ఎన్టీఆర్- మ‌హానాయ‌కుడు పేరుతో రెండు సినిమాలుగా తెర‌కెక్కిస్తున్నారు క్రిష్‌. క‌థానాయ‌కుడు సంక్రాంతికి రిలీజ‌వుతుంటే - మ‌హానాయ‌కుడు రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ‌వుతోంది. క్రిష్ ఎంతో జోష్‌ తో శ‌ర‌వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు.

ఈ చిత్రంలో నంద‌మూరి హీరోలు ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా ప్ర‌జ‌ల్లో సాగుతోంది. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడిగా టైటిల్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు స‌రే.. వేరే నంద‌మూరి హీరోల‌కు చోటుందా? అంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ సోష‌ల్ మీడియాలో ర‌న్ అవుతున్న వేళ దివంగ‌త హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ళ్యాణ్‌ రామ్ ని ఎంపిక చేసుకున్నారు బాల‌య్య‌. ఎన్టీఆర్ యుక్త వ‌య‌స్కుడిగా ఉన్న‌ప్పుడు.. నూనూగు మీసాల బాల‌కుడి పాత్ర‌లో మోక్ష‌జ్ఞ న‌టిస్తార‌ని ప్ర‌చార‌మైనా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే దానికి ఆస్కారం లేద‌ని తెలుస్తోంది.

దాదాపు ఏడెనిమిదేళ్ల త‌ర్వాత బాబాయ్- అబ్బాయ్ ఒకే వేదిక‌పై క‌నిపించి నంద‌మూరి అభిమానుల‌కు మేమంతా ఒక‌టే అన్న సంకేతం ఇచ్చారు. `అర‌వింద స‌మేత` స‌క్సెస్ ఈవెంట్ అందుకు సాక్ష్యంగా నిలిచింది. బాల‌య్య‌ - ఎన్టీఆర్ - క‌ళ్యాణ్‌ రామ్‌ ల‌ను ఒకే వేదిక‌పై చూసుకుని నంద‌మూరి అభిమానులు మురిసిపోయారు. అయినంత మాత్రాన ఎన్టీఆర్ .. బాల‌య్య చిత్రంలో న‌టిస్తున్నారా? అంటే లేనేలేద‌నే తెలుస్తోంది. `ఎన్టీఆర్` బ‌యోపిక్‌ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌డం లేద‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ నుంచి క‌న్ఫర్మేష‌న్ వ‌చ్చింది. అన్ని పాత్ర‌లు ఇప్ప‌టికే ఫుల్ ఫిల్ అయ్యాయి కాబ‌ట్టి క‌నీసం తార‌క్ క‌థ నేరేష‌న్‌ కి సంబంధించిన వాయిస్ వోవ‌ర్ అయినా ఇస్తారేమో! అంటూ ఊహాగానాలు సాగాయి. కానీ అందుకు కూడా ఛాన్స్ లేద‌ని క్రిష్ చెప్పారు. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి తార‌క్ ను ఏ విష‌యంలోనూ సంప్ర‌దించ‌లేద‌ని క్రిష్ క్లారిటీనిచ్చారు. దీనిని బ‌ట్టి బాబాయ్- అబ్బాయ్ (ఎన్టీఆర్‌) కాంబినేష‌న్‌ ని తెర‌పై వీక్షించే అవ‌కాశం లేద‌ని రూడీ అయిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది.
   

Tags:    

Similar News