రాహుల్ గాంధీ తో డేట్.. అన్న స్టార్ హీరోయిన్

Update: 2019-03-02 12:18 GMT
సహజంగా ఎవరైనా కొత్త బాలీవుడ్ హీరోయిన్లను ఎవరితో డేట్ కు వెళ్ళాలని ఉంది అని అడిగితే దాదాపుగా ఏ హాలీవుడ్ హీరో పేరునో లేదా బాలీవుడ్ స్టార్ పేరునో చెప్తారు కానీ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆద్యక్షుడు రాహుల్ గాంధి పేరు చెప్పింది.  మీరు ఓ.. అని గింజుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ విషయం జరిగింది ఇప్పుడు కాదు. ఫ్లాష్ బ్యాక్ లో.. పదిహేడేళ్ళ క్రితం.

కరీనా కపూర్ 'రెఫ్యూజీ' చిత్రం ద్వారా 2000 వ సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  చిత్రమైన విషయం ఏంటంటే అదే సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  కరీనా హీరోయిన్ అయిన కొత్తల్లో అంటే 2002 లో సిమి గరేవాల్ నిర్వహించే రెండెజ్వస్ విత్ సిమి గరేవాల్ అనే ఒక టీవీ షో కు హాజరైంది.  ఆ షోలో సిమి గరేవాల్ "మీరు కనుక డేట్ వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్ళాలని ఉంది?" అని అడిగింది.

ఆ ప్రశ్నకు పెద్ద సమాధానమే ఇచ్చింది కరీనా.."ఇది చెప్పొచ్చో లేదో  నాకు తెలీదు. కానీ చెప్తాను.  ఒకవేళ వివాదం అయినా పట్టించుకోను.  రాహుల్ గాంధి.  అయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇండియా టుడే మ్యాగజైన్  పేజీలను తిప్పుతూ అయన ఫోటోలు చూస్తున్నప్పుడు ఆయనతో సంభాషణ ఎలా ఉంటుంది అని ఆలోచించాను.  నేనేమో సినిమా ఫ్యామిలీ నుండి వచ్చాను.. ఆయన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.  సో.. ఇద్దరి సంభాషణ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనిపించింది."  రీసెంట్ గా ఆ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా జనవరిలో ఈ వీడియో గురించి కరీనా దగ్గర ప్రస్తావించినప్పుడు అలా అనుకున్నమాట నిజమని.. అదెప్పుడో చాలా కాలం క్రితం అని.. ఇప్పుడు అలాంటి ఫ్యాసినేషన్ ఏమీ లేదని చెప్పింది.  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను 2012 లో పెళ్లి చేసుకున్న కరీనాకు ఒక బాబు. ఆ బాబు పేరు తైముర్ అలీ ఖాన్. ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'గుడ్ న్యూస్'.. కరణ్ జోహార్ బ్యానర్లో తెరకెక్కుతున్న 'తఖ్త్' సినిమాలలో కరీనా నటిస్తోంది.


Full View


Tags:    

Similar News