డిసెంబర్ 11న సెట్స్ లో అడుగుపెట్టనున్న మెగా హీరో..!
'విజేత' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఇప్పటికే 'సూపర్ మచ్చి' సినిమాని చివరి దశకు తీసుకొచ్చిన కళ్యాణ్.. 'కిన్నెరసాని' అనే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో 'కిన్నెరసాని' చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డిసెంబర్ 11 నుంచి హీరో కళ్యాణ్ దేవ్ సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ప్రస్తుతం నిహారిక పెళ్లి కోసం ఉదయ్ పూర్ లో ఉన్న కళ్యాణ్.. వివాహ కార్యక్రమాలు పూర్టైన వెంటనే షూటింగ్ లో పాల్గొంటాడాని అంటున్నారు.
కాగా, 'కిన్నెరసాని' సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందనుందని సమాచారం. ఈ స్టోరీని విన్న చిరంజీవి.. కళ్యాణ్ దేవ్ కి సూట్ అవుతుందని వెంటనే ఓకే చేసాడట. దీనికి 'కల్కి' చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయి తేజ్ కథ - కథనం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'కిన్నెరసాని' టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'అతి సర్వత్ర వర్జయత్' అనే సంస్కృత పదాలను ఉపశీర్షికగా పెట్టి సినిమాపై ఆసక్తిని కలిగించారు. కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు నిర్మిస్తున్న రామ్ తళ్లూరి మరో కంటెంట్ బేస్డ్ సినిమాని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. మొదటిసారిగా థ్లిలర్ లో నటిస్తున్న మెగా చిన్నల్లుడికి 'కిన్నెరసాని' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.