రైట‌ర్ కం పార్ట్ న‌ర్ ని ఉంచాలా.. ఎలిమినేట్ చేయాలా?

Update: 2020-10-04 05:15 GMT
పెట్టుబ‌డితో ప‌నే లేకుండా గుడ్ విల్ నే అస్త్రంగా వాడేస్తూ తెలివైన ఆర్జ‌కుడిగా ఆ ట్యాలెంటెడ్ రైట‌ర్ గురించి గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. క్రేజీ కాంబినేష‌న్ ‌లను సెట్ చేస్తూ సాఫీగా వాటాల్ని ద‌క్కించుకునే వాళ్ల‌లో ప్ర‌స్తుతం ముందు వ‌రుస‌లో నిలుస్తారాయ‌న‌. ఒక‌ప్పుడు రైట‌ర్ గా మంచి పేరుతో పాటు వ‌రుస హిట్లు సొంతం చేసుకున్న ఈ స్టార్ రైట‌ర్ పెన్ను ప‌దును ప‌లుచ‌నైపోవ‌డంతో గ‌త కొంత కాలంగా చిక్కులొచ్చి ప‌డుతున్నాయ్. క్రేజీ బ్యాన‌ర్ ‌ల‌తో క‌లిసి ఆయ‌న భాగ‌స్వామ్య ప్రాజెక్ట్ లను సెట్ చేస్తున్నా ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

అలా సెట్ చేసిన‌వేవీ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అత‌డికి చిక్కొచ్చి ప‌డింద‌ట‌. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ ‌ల‌లో వాటా ద‌క్కుతున్నా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం అవి మిస్ ఫైర్ అవుతుంటే అత‌డికి అండ‌గా నిలిచే ప్ర‌ముఖ కంపెనీలో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. అనుభవం వుండి కూడా కొత్తవాడిలాగా తేలిపోతున్న ఆయ‌న స‌రైన హిట్టివ్వ‌లేక‌పోతున్నారు. దీంతో స‌ద‌రు రైట‌ర్ కం భాగ‌స్వామిని ఉంచాలా ఎలిమినేట్ చేయాలా? అన్న సందిగ్ధంలో ప‌డిపోయింద‌ట స‌ద‌రు కంపెనీ.

మేకింగ్‌.. టేకింగ్ విష‌యాల్లో వున్న శ్ర‌ద్ధ కంటెంట్ పై లేక‌పోవ‌డంతో ఆయ‌న గారు సెట్ చేసిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లాపడిపోవ‌డం మెంట‌లెక్కిస్తోంద‌ట‌. తాజాగా రిలీజైన మూవీ ఫ‌లితం తేలిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న‌తో తెగ‌తెంపుల‌కు స‌ద‌రు ఎన్నారై నిర్మాత‌ రెడీ అవుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌లు హీటె‌క్కించేస్తున్నాయి.
Tags:    

Similar News