టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నగా అందరికి సుపరిచితమే. అంతేకాకుండా వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. గతేడాది ఎలక్షన్స్ సమయంలో 'నా ఛానల్ నా ఇష్టం' అంటూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్ చేస్తున్నాడు. ఈ మధ్య రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరోసారి అందరి దృష్టి అటువైపు మళ్లించేలా చేసింది. ''ప్రజారోగ్య హెచ్చరిక. పిచ్చి కుక్కలని డీల్ చేయడం ప్రమాదకరం. మీరు వారిని నిర్బంధంలో ఉంచండి. కానీ దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. అది మన జీవితానికి చేటు చేస్తుంది. ఇది పిచ్చి కుక్కల సీజన్'' అంటూ నాగబాబు ట్వీట్ చేసారు. ఇప్పుడు నాగబాబు ట్వీట్ ఎవరి గురించి చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
నాగబాబు ప్రజారోగ్యం పట్ల ఆలోచన చేసి ట్వీట్ చేశాడు బాగానే ఉంది. కానీ ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న టైములో నిజంగా ఈ ట్వీట్ పిచ్చి కుక్కల గురించే చేశాడా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా విరుచుకుపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై నోరు జారొద్దు. మీటింగ్ కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో ఉంచుకోవాలి. బాలయ్య ఒకటంటే.. మేము రెండు మాటలనేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వానికీ సినీ ఇండస్ట్రీకి బాలయ్య క్షమాపణలు చెప్పాలి. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు జస్ట్ ఒక హీరో మాత్రమే అంటూ పలు ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలోని కొందరు ఇప్పుడు బాలయ్యతో పాటు నాగబాబుని కూడా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ బాలయ్య మరియు ఆయన సపోర్టర్స్ మీద డైరెక్ట్ గా అనకుండా ఇలా ఇండైరెక్ట్ గా ట్వీట్ వేసాడా అంటూ నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడో తెలియదు కానీ.. ఇప్పటికే నాగబాబు - బాలయ్యల వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతుంటే నాగబాబు వేసే ట్వీట్స్ ఎక్కడి దాకా దారితీస్తాయో అంటూ సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.