అబ్బా.. అఖిల్ అప్పుడే ఇంతలా ఆలోచిస్తున్నాడా?
అక్కినేని ప్రిన్స్ అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతా సజావుగా సాగితే వచ్చే నెలలో అఖిల్ మూవీ విడుదల ఉండేది. కాని కరోనా కల్లోలం కారణంగా సినిమా విడుదల విషయంలో గందరగోళం ఏర్పడినది. బ్యాచిలర్ సినిమా విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అఖిల్ తదుపరి చిత్రం విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అఖిల్ తన 5వ చిత్రంతో మొదటి సినిమా నష్టంను భర్తీ చేయాలనుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తన మొదటి సినిమా అఖిల్ ను నిర్మించి భారీగా నష్టపోయిన నిర్మాత నితిన్ కు సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. అందుకే తన 5వ చిత్రాన్ని పారితోషికం తీసుకోకుండా నితిన్ నిర్మాణంలో చేయాలని భావిస్తున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరు మరోసారి కవబోతున్నట్లుగా ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మద్య ఉన్న స్నేహంతో అఖిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
అఖిల్ మొదటి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఆ సినిమా ఏకంగా పాతిక కోట్ల వరకు నితిన్ కు నష్టాలను మిగిల్చినట్లుగా సమాచారం. ఆ నష్టంను భర్తీ చేసే ఉద్దేశ్యంతో మరోసారి ఆయన బ్యానర్ లో చేయాలనే నిర్ణయానికి అఖిల్ వచ్చాడట. చేసింది మూడు సినిమాలు అవి కూడా పెద్దగా ఆడకున్నా కూడా అఖిల్ అప్పుడే తన నిర్మాత లాస్ ను భర్తీ చేయాలనే ఆలోచన చేస్తున్నాడా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక నితిన్ కూడా అఖిత్ తో మళ్లీ సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
సుకుమార్ ఇప్పటికే అఖిల్ కోసం ఒక కథను సిద్దం చేశాడని.. నితిన్ కు కూడా ఆ స్టోరీ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అఖిల్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంతో అయినా సక్సెస్ అందుకుంటాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సమయంలో అఖిల్ తో మరో ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద సాహస నిర్ణయం. మరి నితిన్ ఏ నమ్మకంతో అఖిల్ 5ని నిర్మించేందుకు కమిట్ అయ్యాడో కాని ఈసారి అయినా బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా నష్టం భర్తీ చేయడం ఏమో కాని నితిన్ కు మరింత కష్టం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.