బ‌న్నీపై మ‌న‌సు పారేసుకున్న ఆపిల్ బ్యూటీ

Update: 2021-08-30 06:30 GMT
ముంబై బ్యూటీ హన్సిక 2007 లో అల్లు అర్జున్ -పూరి జగన్నాధ్ కాంబినేష‌న్ మూవీ `దేశముదురు`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. న‌వ‌న‌వ‌లాడే ఆపిల్ అందంతో కుర్రాళ్ల గుండెల్ని గిల్లేసిన హ‌న్సిక ఆ త‌ర్వాత వేగంగా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగేస్తుంద‌ని అనుకున్నారు. కానీ తాను అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది ఇంకొక‌టి. కెరీర్ పరంగా టాలీవుడ్ కోలీవుడ్ లో వెనక్కి తిరిగి చూడన‌న్ని అవ‌కాశాలు ద‌క్కించుకున్నా కానీ స్టార్ డ‌మ్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ కి ఎద‌గ‌డంలో త‌డ‌బ‌డింది ఈ బ్యూటీ.

అయినా దేశ‌ముదురుతో ఎంట్రీ వ‌ల్ల‌నే క‌నీసం ఆ స్థాయికి ఎదిగింద‌న్న‌ది వాస్త‌వం. ఇంత‌కీ హ‌న్సిక‌కు దేశ‌ముదురు ఇంకా గుర్తుందా? అంటే... ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో తన అనుచరులతో చేసిన చిట్ చాట్ లో హన్సికను అల్లు అర్జున్ గురించి చెప్పమని ఒక అభిమాని అడిగాడు. ``మధురమైన.. దయగల.. సరదా గ‌ల వాడు.. నా మొదటి సహనటుడు!`` అని హన్సిక సమాధానమిచ్చింది. ఆపిల్ బ్యూటీ బ‌న్నీని వ‌ర్ణించిన తీరుకు ఆ అభిమాని ఫిదా అయిపోయాడు. అల్లు అర్జున్ తన ఇన్ స్టా కథనాలను ఎంచుకుని హన్సికకు కృతజ్ఞతలు తెలిపాడు.. ధన్యవాదాలు స్వీటీ.. అంటూ ఉప్పొంగిపోయాడు. అయితే ఇప్పుడు హ‌న్సిక ఉన్న స్టాట‌స్ లో త‌న‌కు బ‌న్నీ లాంటి పెద్ద స్టార్ తో తెలుగులో కంబ్యాక్ అవ‌స‌రం. మ‌రి బ‌న్నీ ఛాన్సిస్తున్నారా? అన్న‌ది చూడాలి.

ఇటీవ‌ల హ‌న్సిక ఏమైపోయింది? చ‌డీచ‌ప్పుడు లేనే లేదు? అస‌లు న‌టిస్తోందా లేదా? అంటూ కొంద‌రు సందేహం వ్య‌క్తం చేశారు. అయితే హ‌న్సిక‌కు కెరీర్ ప‌రంగా డోఖా ఏం లేదు. చాలా చిన్న వ‌య‌సులో బాల‌నటిగా ప‌రిచ‌య‌మై అటుపై క‌థానాయిక అయిన ఈ బ్యూటీ ఇటీవ‌ల కొంత‌ ఔట్ డేటెడ్ అయ్యింది.

అల్లు అర్జున్ స‌ర‌స‌న దేశ‌ముదురులో న‌టించిన హ‌న్సిక ఆ త‌ర్వాత మంచు కాంపౌండ్ లో స్థిర‌ప‌డి వ‌రుస అవ‌కాశాలు అందుకుంది. కానీ అవేవీ త‌న కెరీర్ కి పెద్ద స్థాయిలో క‌లిసి రాలేదు. ఆ క్ర‌మంలోనే త‌మిళంలో అవ‌కాశాలు అందుకుని అక్క‌డ స్థిర‌ప‌డింది. రెండేళ్ల క్రితం శింబుతో ప్రేమాయ‌ణానికి బ్రేక్ ప‌డిపోయాక కెరీర్ ప‌రంగా ఎందుక‌నో స్లో అయ్యింది. కానీ ఇంత‌లోనే తిరిగి కెరీర్ ని ట్రాక్ లో వేయాలని గ‌ట్టి ప్లాన్ వేసింది.. కానీ ఛాన్సులైతే రాలేదు.

ఇటీవ‌ల‌ తెలుగులోనూ ఓ సినిమాకి క‌మిటైంద‌న్న టాక్ ఇటీవ‌ల వినిపించింది. త‌మిళంలో మహా అనే థ్రిల్లర్ మూవీలో న‌టిస్తోంది. సిగ‌రెట్ ఊదేసే మాతాజీ పాత్ర‌లో హ‌న్షిక మెరిపించ‌నుంది. ఇది త‌న‌ కెరీర్ 50వ చిత్రం. యు.ఆర్.జమీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఎట్సెటెరా ఎంటర్ ఐట‌న్ మెంట్ మహా ప్రొడక్షన్ బ్యానర్లో మాథి అజగన్ నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ మాజీ ల‌వ‌ర్ కోలీవుడ్ స్టార్ శింబు ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. 2019 లో కొన్ని సన్నివేశాల కోసం ఈ జంట క‌లిసి న‌టించాక మ‌హ‌మ్మారీ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇటీవ‌ల‌ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసార‌ట‌. అలాగే హ‌న్సిక ఇటీవ‌ల మ‌జా ఆగ‌యా! అంటూ పాప్ ఆల్బ‌మ్ లో న‌టించింది. గురుచౌదరి ఈ సింగిల్ ని ఆల‌పించగా సారెగామా మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో విడుద‌లై ఆక‌ట్టుకుంది.  హ‌న్సిక న‌టించిన సినిమాలన్నీ ఒక‌టొక‌టిగా రిలీజ్ ల‌కు రావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News