• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాల్డ్ హెడ్ బాలీవుడ్...

బాల్డ్ హెడ్ బాలీవుడ్ సినిమాకు మంచి టాక్!

By - Tupaki Desk
Update: 2019-11-08 08:07 GMT
గతంలో సినిమా హీరో హీరోయిన్ల పాత్రలు అన్నీ మంచి లక్షణాలతో ఉండేవి.  శారీరకంగా ఎలాంటి అవకరాలు ఉండేవి కాదు. ఏదో నూటికి కోటికి తప్ప అధికశాతం సినిమాల్లో హీరో హీరోయిన్లు రోల్ మోడల్ తరహాలో ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి హీరో హీరోయిన్ల పాత్రలు ఉన్నాయి కానీ శారీరక.. మానసిక లోపాలు ఉండే పాత్రలను మన దర్శకులు డిజైన్ చేస్తున్నారు.  నిజాని కి సినిమా డిఫరెంట్ గా అనిపించేందుకు ఏదో ఒక లోపం ఉండేలా ప్రధాన పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. ఇదే ట్రెండ్ లో వచ్చిన హిందీ చిత్రం 'బాలా'.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా.. భూమి పెడ్నేకర్.. యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాలా'. ఈ సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్న ఆయుష్మాన్ హీరో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకమే ఉంది.  మరి సినిమా ఎలా ఉంది అంటే.. దాదాపుగా అందరూ 3 రేటింగ్ ఇచ్చారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మంచి ఎంటర్టైనర్ అంటూ కితాబివ్వడం విశేషం.

సినిమా విషయానికి వస్తే హీరోకు బట్ట తల.  మెడపై తల లేకుండా ఉండే జనాలు ఎలా చూస్తారో.. తలపై జుట్టులేకపోతే అలా చూస్తారు మన జనాలు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు బట్టనెత్తి బాధితులు ఉంటారు కాబట్టి ఇది చాలా కామన్ ప్రాబ్లెం. గతంలో యాభైలు అరవైలు దాటితే ఈ సమస్య తలెత్తేది..  ఇప్పుడు ఇరవైల్లోనే అరవైలు కనిపిస్తున్నాయి. ఈ బాల్డ్ హెడ్ సమస్యతో హీరో పడే కష్టాలు 'బాలా' మెయిన్ థీమ్.  బట్టనెత్తి రాకుండా జుట్టు మొలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతోనే బోల్డంత ఫన్ జెనరేట్ అవుతుంది కదా. ఇక ఇంతటి ఆగలేదు. ఈ సినిమాలో ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి.

భూమి పెడ్నేకర్ ఈ సినిమాలు కాస్త నలుపు రంగు లో ఉండే పాత్ర పోషించింది.  అమ్మాయి నలుపుగా ఉంటే అదో పెద్ద అంతర్జాతీయ సమస్య కదా.  మరో హీరోయిన్ యామి గౌతమ్ కు చదువుసంధ్యలు ఉండవు.. అయితే తెల్లగా మిల్కీ బ్యూటీలా ఉంటుంది.  టిక్ టాక్ లతో దుమ్ములేపుతూ ఉంటుంది.  మాటిమాటికి టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటుంది.  బాలా సినిమాలో ప్రధాన పాత్రలు ఇవి.  ఇక వీరి మధ్య సంభాషణల లో కామెడీకి తప్పనిసరిగా స్కోప్ ఉంటుంది కదా. ఓవరాల్ గా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. వీకెండ్ లో ఒక లుక్ వెయ్యోచ్చని అంటున్నారు.
Tags:    
  • Bala 
  • Bollywood 
  • Bollywood Movies 
  • Yami Gautam 
  • Bollywood Latest Movie Releases 
  • Tupaki News 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS