ఏదో ఫ్లూక్ లో హిట్లు కొట్టే డైరెక్టర్ అని ఫిక్సయ్యారా?
కథ కంటెంట్ లో క్రియేటివిటీలో దమ్మెంతో చూపించి హిట్లు కొట్టడం వేరు. ఏదో ఒక హిట్టొచ్చిందని వెంట వెంటనే దానిని ఫాలో అయిపోయి హిట్లు కొట్టేయడం వేరే. ఈ రెండో కేటగిరీనే ఫ్లూక్ ..ఆయాచిత వరం (లక్) అని భావించి లైట్ తీస్కునేవాళ్లు ఉంటారు. ప్రస్తుతం ఆ యంగ్ డైరెక్టర్ సన్నివేశం ఇలానే ఉందట. అతడు ఆరంభం ట్యాలెంటెడ్ స్క్రిప్టులతో టైమింగ్ చూసి హిట్లు కొట్టినా కాలక్రమంలో ఫేక్ ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొన్న సంక్రాంతి బరిలో రిలీజైన మూవీ రేస్ లో వెనకబడడమే గాక క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకోకపోవడంతో అది కాస్తా ఆయనకు మైనస్ గా మారిందట. అందుకే తన నుంచి మరో కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ రావడం లేదు అంటూ గుసగుస వినిపిస్తోంది.
అంతకుముందు పండగ బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ చిత్రానికి సీక్వెల్ తీస్తాడంటూ ప్రచారమైనా దానికి సంబంధించిన ప్రకటన కూడా ఏదీ లేదు. అయితే దీనికి ఓ కారణం ఉందంటున్నారు. మొన్న పండక్కి రిలీజ్ చేసిన అతడి సినిమా బాక్సాఫీస్ రేస్ లో వెనుకబడటం ఓ కారణం అయితే... కనీసం టీవీలో కూడా సరైన టీఆర్పీలు రాలేదు. దీంతో ఫ్లూక్ హిట్స్ డైరెక్టర్ జాబితాలో చాలా మంది అగ్ర నిర్మాతలు సదరు దర్శకుడిని చేర్చేసినట్లుగా తెలిసింది. ఇక పండగ హిట్ సీక్వెల్ తీసేందుకు రెడీ అయిన నిర్మాత కూడా ఇటీవల దాని గురించి మళ్లీ అతడితో మాటైనా ఎత్తడం లేదట. దీంతో సదరు డైరెక్టర్ పూర్తిగా ఖాళీగానే ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.