ఎఫ్ 2 దర్శకుడు.. వెంకీ అల్లుడి కాంబో?
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ దక్కించుకుని ఆ వెంటనే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించి మరో విజయాన్నితన ఖాతాలో వేసుకుని ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది ఎరుగకుండా దూసుకు పోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన ఎఫ్ 3 సినిమా మేకింగ్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఎఫ్ 3 తర్వాత అనీల్ రావిపూడి చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయమై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడ్డట్లయ్యింది. బాలయ్యతో పాటు పలువురు హీరోలతో అనీల్ రావిపూడి మూవీ ఉండబోతుందని వార్తలు వచ్చినా చివరకు నాగచైతన్యతో అనీల్ రావిపూడి మూవీ సెట్ అయినట్లుగా తెలుస్తోంది.
నాగచైతన్య మరియు ఇంద్రగంటిల కాంబినేషన్ లో సినిమాను నిర్మించాలనుకున్న సాహూ గారపాటి నిర్మాణంలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాహూ బ్యానర్ లో అనీల్ రావిపూడి ఒక సినిమాను చేయాల్సి ఉంది. అనీల్ డేట్లు ఉన్న సాహూ వాటిని చైతూ కోసం వినియోగించే ఉద్దేశ్యంతో ఉన్నాడట. నాగచైతన్య మరియు అనీల్ రావిపూడిల కాంబో దాదాపుగా ఫైనల్ అయినట్లే అంటున్నారు. అయితే కాస్త సమయం పడుతుందని మాత్రం సినీ వర్గాల టాక్. ప్రస్తుతం చైతూ 'థ్యాంక్యూ' మూవీని చేయబోతున్న విషయం తెల్సిందే. అనీల్ రావిపూడి మరియు చైతూలు ఇద్దరు కూడా ఇప్పటికే సినిమాలు కమిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసి 2022 వరకు కాంబోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.