కాఫీ తోటలో రాకుమారి కింగ్ కోసం పరితపించి!
ఆ యంగ్ బ్యూటీ తారాజువ్వలా తారాలోకంలోకి దూసుకొచ్చింది. టాలీవుడ్ కి పరిచయం అయిన కేవలం రెండేళ్లలోనే అగ్ర నాయికగా ఎదిగేసింది. టాప్ హీరోలంతా తనకు సలాం కొట్టారు. వరుసగా తమ సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఆరంగేట్రం ఒక యువహీరోతో నటించి.. ఆ వెంటనే నాని-నాగ్ మల్టీస్టారర్ లో.. అలాగే మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ లోనూ నాయికగా వెలిగిపోయింది. ఇప్పుడు ఏకంగా బన్ని సరసన అవకాశం అందుకుంది. ఇంతకీ ఎవరీ భామ? అన్నది సస్పెన్స్ లో ఉంచితే..
ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే షాకిచ్చే విషయాలే తెలిసాయి. తనకు కూర్గ్ లో సొంతంగా కాఫీ తోటలున్నాయి. తన తండ్రి గారు ఈ కాఫీ తోటలను చూసుకుంటారు. ఇక్కడ టన్నుల కొద్దీ కాఫీ ఉత్పత్తి అవుతుంది. కూర్గ్ అంటే అందమైన ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ క్వారంటైన్ టైమ్ ని కాఫీ తోటల్లో హాయిగా గడిపేసింది ఈ అమ్మడు.
ఇప్పటికైనా సదరు భామ ఎవరో గుర్తొచ్చిందా? ఇంకెవరు.. అందాల రష్మిక. ఆసక్తికరంగా ఈ బ్యూటీ తన కాఫీ తోటల నుంచి కోస్టార్లకు కాఫీ గింజలు పంపించే అలవాటుంది. ముఖ్యంగా దేవదాస్ లో నటించిన దేవా నాగార్జునకు కాఫీ పంపిస్తుంటుంది. ఇప్పటికీ నాగ్ ఆ కాఫీనే తాగుతుంటారట. నిన్న బర్త్ డే రోజున కూడా ఆ విషయాన్ని ఆయన స్వయంగా గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. అందరూ పోస్టర్లు వేసి నాగార్జునకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. కానీ రష్మిక మాత్రం కాఫీ సరఫరా చేస్తూ హాయిగా ఉంచుతోంది. సూపర్ ఐడియా కదూ?