• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మార్పుకోసం చిన్ననాటే...

మార్పుకోసం చిన్ననాటే ఎన్టీఆర్‌ వారసత్వం

By - Tupaki Desk
Update: 2018-08-29 11:02 GMT
హరికృష్ణ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను, రాజకీయ, సినీ ప్రముఖులను తీవ్రంగా కలిచి వేసింది. సినీ ప్రముఖులు దాదాపు ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణతో ఉన్న తమ అనుబంధంను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణతో పరిచయం లేని వారు కూడా ఆయన మరణంపై సోషల్‌ మీడియాలో తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందరిలోకి విభిన్నంగా దర్శకుడు క్రిష్‌ తన సంతాపంను వ్యక్తం చేశారు. క్రిష్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ముందు బాల హరికృష్ణ నడుస్తూ ఉండగా, ఎన్టీఆర్‌ ఆ వెనుక ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నారు. ఈ ఫొటోను 1962వ సంవత్సరంలో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరంచిన సమయంలో తీసినది. తండ్రితో పాటు విరాళాల సేకరణకు జనాల్లోకి వెళ్లి అప్పుడే తండ్రి వారసత్వంను పునికి పుచ్చుకున్న హరికృష్ణ చిన్నప్పటి నుండే ఒక ఉన్నతమైన ఆలోచనతో పెరిగారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన క్రిష్‌.. ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య సారథ్యం చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’’ అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది.

ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ తెరకెక్కుతుంది. బయోపిక్‌ కోసం ఎన్టీఆర్‌ గురించి రీసెర్చ్‌ చేసిన సమయంలో క్రిష్‌ కు ఈ ఫొటో లభించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిత్రంలో హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌ తో చేయిస్తున్న క్రిష్‌ ఈ ఫొటోను షేర్‌ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, కళ్లు చెమర్చేలా చేశాడు. క్రిష్‌ తన వంతుగా హరికృష్ణకు గొప్పగా నివాళ్లు అర్పించారు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వ్యక్తం అవుతున్నాయి.

Tags:    
  • Director Krish 
  • NTR 

Similar News

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

Copyright @2026

Powered by Blink CMS