బాలయ్యతో నేను చేస్తున్నది ప్రయోగమే: అనిల్ రావిపూడి
ఒక కథలో అన్ని రకాల ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల అంశాలను అందంగా సర్దేసి అందించే దర్శకులలో త్రివిక్రమ్ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇవన్నీ కూడా ఆయన సినిమాల్లో ఉంటాయి. అందువల్లనే ఆయన సినిమాలకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ నీడను కూడా తన వైపుకు రానీయకుండా అనిల్ రావిపూడి ముందుకు వెళుతున్నాడు.
అలాంటి అనిల్ రావిపూడి తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను వెంటనే మొదలుపెట్టనున్నాడు. ఆల్రెడీ ఆయన బాలకృష్ణకి కథ చెప్పడం .. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోవడం జరిగిపోయింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కథ ఏమిటి? ఇందులో బాలయ్యను ఆయన ఎలా చూపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అది ఇన్నాళ్లకి కుదిరింది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి అర్థం చెప్పే కథ ఇది. ఈ సినిమాలో ఓ 50 ఏళ్ల తండ్రి పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది. ఆ తండ్రి ఆ కూతురితో ఎలా ఉంటాడు? ఆ కూతురు కోసం ఏం చేస్తాడు? అనే అంశం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. కథ వినగానే బాలయ్య చాలా ఆసక్తిని కనబరిచారు. ఈ సినిమాను చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు.
'పోకిరి' .. ' అర్జున్ రెడ్డి' .. 'గబ్బర్ సింగ్' వంటి సినిమాల్లో హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కూడా కథ అంతా కూడా బాలయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందువల్లనే ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. బాలయ్య లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఏంటి .. బాలయ్య బాబును ఇలా కూడా చూపించవచ్చా? అనుకోవడం ఖాయం. ఆయన స్టైల్ .. బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీని అభిమానులు ఆశించేలానే ఉంచుతూ, కొత్త కోణంలో ఆయనను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా మార్కు కామెడీ తక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఆయనతో నేను చేస్తున్నది ప్రయోగమే అవుతుంది. నా స్టైల్ ను పక్కన పెట్టేసి చేసే ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది చూడాలి మరి" అంటూ చెప్పుకొచ్చాడు.