ఆ సినిమా దిల్ రాజు చేతికెలా వచ్చింది?

Update: 2016-09-30 19:30 GMT
ఈ మధ్య దిల్ రాజు ఓ భారీ ఓవర్సీస్ డీల్ చేసుకున్నట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలన్నింటి ఓవర్సీస్ రైట్స్.. గుంపగుత్తగా అమ్మేసినట్లుగా చెప్పుకున్నారు. ఈ డీల్ విషయంలో ఇప్పుడు అఫీషియల్ న్యూసే వచ్చేసింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో మంచి పేరున్న బ్లూ స్కై సంస్థ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్ని ఓవర్సీస్‌ లో రిలీజ్ చేయడానికి ఒకేసారి డీల్ కుదుర్చుకుంది. ఐతే అందులో ఆఖరున ఉన్న సినిమా పేరే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. దువ్వాడ జగన్నాథం.. ఫిదా.. శతమానం భవతి.. నేను లోకల్.. ఈ నాలుగూ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలే అన్న సంగతి తెలిసిందే.

ఐతే లిస్టులో చివర్న ఉన్న ‘నాన్న నేను.. నా బాయ్ ఫ్రెండ్స్’ పేరే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా దిల్ రాజుది కాదు. ‘సినిమా చూపిస్త మావ’ ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. అతనే నిర్మాత అనుకుంటున్నారంతా. కానీ ఈ ప్రాజెక్టు దిల్ రాజు చేతికి ఎప్పుడొచ్చిందో ఏమిటో? ఒకవేళ ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ ను హోల్ సేల్ గా కొనేసి.. మారు బేరానికి ఓవర్సీస్ రైట్స్ అమ్ముతున్నాడో ఏంటో. బ్లూ స్కై ఇచ్చిన ప్రకటనలో అలంటి ప్రస్తావనేమీ లేదు. ఏదేమైనా ఈ డీల్ తో దిల్ రాజు దాదాపు రూ.20 కోట్ల దాకా వర్కవుట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ తలనొప్పీ లేకుండా మంచి రేటుకు ఐదు సినిమాలు కలిపి ఒకేసారి డీల్ చేసుకుున్నందుకు దిల్ రాజు చాలా హ్యాపీగా ఉండుంటాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News