క్రేజీ హీరో భారీ ప్రాజెక్టులు క్యాన్సిల్.. అసలేం జరుగుతోంది?
కోవిడ్ మహమ్మారీ విలయం ప్రభావం నెమ్మదిగా బయటపడుతోంది. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటపడుతున్నామన్న ధీమా కనిపిస్తున్నా.. హై ఎండ్ బిజినెస్ వర్గాల్లో మాత్రం టెన్షన్ వాతావరణం ఇంకా సద్ధుమణగలేదనేందుకు తాజా పరిణామం సాక్ష్యంగా నిలుస్తోంది.
లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం.. ఫిల్మ్ బిజినెస్ నుండి ప్రఖ్యాత అంతర్జాతీయ సినీనిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిష్క్రమించడం షాక్ కి గురి చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం కిలాడీ అక్షయ్ కుమార్‌తో మూడు చిత్రాల ఒప్పందాన్ని ప్రశ్నార్థకం చేసిందన్న గుసగుసా వేడెక్కిస్తోంది.
సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బ్యానర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ తో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నవంబర్ 2018 లో ప్రకటించింది. ఇది ఒక గొప్ప అసోసియేషన్ కి ఆరంభం అనిపించింది. స్పష్టంగా ఇది బాలీవుడ్ వాణిజ్యాన్ని చాలా ఉత్సాహపరిచింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి చిత్రం 2019 హిట్ అయిన సైన్స్ ఫిక్షన్ డ్రామా మిషన్ మంగల్. ఫాక్స్ - అక్షయ్ భాగస్వామ్యంలో `లక్ష్మీ`(లక్ష్మీ బాంబ్ ) కూడా రిలీజైంది. ఇది ఈద్ 2020 లో సినిమాహాళ్లలో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్లో థియేటర్లు మూసివేయబడినందున దీపావళికి వాయిదా పడింది. పైగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (OTT)లో విడుదలైంది.
ఈ భాగస్వామ్యంలో మూడవ చిత్రం ఏది? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ ..ఇది జరగదని అర్థమవుతోంది. “అక్షయ్ కుమార్ తో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ జాలీ ఎల్ ఎల్ బి 2 కి ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం సఫలమైంది. ఇది 2017 లో అతిపెద్ద విజయాలలో ఒకటి. ఫాక్స్ యొక్క సోలో ప్రొడక్షన్ కూడా. 2018 లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు స్టూడియో వ్యాపారం నుండి నిష్క్రమిస్తుందని డిస్నీ స్వాధీనం చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే భారతదేశంలో చిత్ర నిర్మాణానికి డిస్నీ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అలాగే క్రేజీ సినిమాల మేధో సంపత్తి హక్కులను కొనుక్కునేందుకు దాచుకునేందుకు డిస్నీ ఇష్టపడుతోంది. కాని ఇక్కడ ఉన్న మా కళాకారులు.. నిర్మాతలు.. స్టూడియోల నుండి ఏదీ డిస్నీ ఆశించదు. తత్ఫలితంగా ఈ ఒప్పందం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అక్షయ్ తో ఫాక్స్ స్టార్ సంస్థ మూడవ చిత్రం సమీప భవిష్యత్తులో తెరకెక్కుతుందా? అన్నది సందిగ్ధంగా మారిందని జాతీయ మీడియాలు వెల్లడిస్తున్నాయి.
అక్షయ్ ఒప్పందం గురించి జాతీయ మీడియా డిస్నీ బృందాన్ని సంప్రదించినా స్పందించలేదన్న సమాచారం వేడెక్కిస్తోంది. “అక్షయ్ కుమార్ రాబోయే రెండేళ్ళకు బుక్ అయ్యాడు. అతను బచ్చన్ పాండే- రక్షా బంధన్- రామ్ సేతు- మిషన్ లయన్ సినిమాలతో పాటు ముదస్సార్ అజీజ్ నెక్స్ట్, ... యష్ రాజ్ ఫిల్మ్స్ నెక్స్ట్ తదితర వాటి కోసం షూటింగ్ చేయనున్నాడు. ఫాక్స్ స్టార్ తో మూవీ 2022 మధ్య లేదా 2022-ముగింపు తర్వాత మాత్రమే జరుగుతుంది`` అని ఓ ప్రముఖుడు వెల్లడించినట్టు తెలిసింది.
ఇక ఫాక్స్ స్టార్ - డిస్నీ మెర్జింగ్ సంగతి అటుంచితే అమెరికాలో పలు థియేటర్ల చైన్ వ్యాపారం కోవిడ్ వల్ల ప్రభావితం అవుతోందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అక్కడా ఎంవోయులు టేకోవర్లు అంటూ హడావుడి కనిపించింది. కనీసం మునుముందు ఈ పరిస్థితులు సద్ధుమణగాలంటే కోవిడ్ మహమ్మారీ పూర్తిగా అంతమవ్వాలని భావిస్తున్నారు.