మరోసారి శ్రీమంతుడితో రొమాన్స్ చేయనున్న చారుశీల..!!

Update: 2020-12-29 16:44 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' పాడేందుకు సిద్ధం అవుతున్నాడు. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ తో కీర్తిసురేష్ రొమాన్స్ చేయబోతుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. గత కొన్నేళ్లుగా అంటే శ్రీమంతుడు మూవీ నుండి వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ ఇలా హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పై మహేష్ అభిమానులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టైటిల్ దగ్గర నుండి మొన్నటి మోషన్ పోస్టర్ వరకు అన్ని ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేసాయి. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సర్కారు వారి పాట.. పక్కా మహేష్ అభిమానులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.

ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ కి మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ అందించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆ సినిమా తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ కూడా పట్టాలెక్కాల్సి ఉండేది. కానీ ఆ సినిమాను పక్కా తెరమీదకి తీసుకొస్తాను అంటున్నాడట డైరెక్టర్ వంశీ. ఈ సినిమాలో మహేష్ ఒక మాఫియా డాన్ గా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. అయితే సర్కారు వారి పాట పూర్తయ్యేలోపు వంశీ మహేష్ కోసం ఆ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడట. అంతేగాక ఈ సినిమాకోసం ఓ హీరోయిన్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ సరసన శృతిహాసన్ ను పరిశీలిస్తున్నాడట వంశీ. మహేష్ శృతి కాంబోలో ఇప్పటికే శ్రీమంతుడు బిగ్ హిట్ ఉంది. అలాగే వంశీ - శృతి కాంబోలో ఎవడు బిగ్ హిట్ ఉంది. అయితే మరోసారి ఈ ముగ్గురు మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతారేమో చూడాలి. ఇదే గనక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.
Tags:    

Similar News