ఆ న‌లుగురిని ఆడుకుంటున్న మాయ‌దారి మ‌హ‌మ్మారీ

Update: 2020-09-12 06:45 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ విల‌యం ఇంకా ముగిసిపోక‌పోగా.. అంత‌కంత‌కు బెంబేలెత్తిస్తూ వేలాది కేసులు తెలుగు రాష్ట్రాల్లోనే న‌మోద‌వుతున్నాయి. ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌ల్లో అన్ని స‌మీక‌ర‌ణాల్ని మార్చేస్తోంది.

ఫ‌లానా ద‌ర్శ‌కుడు ఫ‌లానా హీరోతో ప‌ని చేస్తాడ‌ని.. లేదా ఫ‌లానా హీరో ఫ‌లానా ద‌ర్శ‌కుడితో మాత్ర‌మే చేస్తాడ‌ని చెప్ప‌లేని ప‌రిస్థితిని తెస్తోంది. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న‌వి సెట్స్ కెళ్లాల్సిన‌వి వాయిదా ప‌డుతుండ‌డంతో ఆ త‌ర్వాత స‌న్నివేశం మొత్తం సీక్వెన్స్ క్ర‌మంలో వెన‌క్కెన‌క్కి వెళ్లిపోతోంది.

ఆ ర‌కంగా మ‌హేష్ .. చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ స‌హా త్రివిక్ర‌మ్.. కొర‌టాల లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు లాకైపోయారు. ఇక ఇండ‌స్ట్రీ ఆ న‌లుగురు అయితే సినిమాలేవీ తీయాలి? అన్న సందిగ్ధంలోనే ఉన్నారు. ఇక ఒక్క త్రివిక్ర‌మ్ సంగ‌తే చూస్తే.. ఆయ‌న త‌దుప‌రి ఎన్టీఆర్ తో సినిమా కోసం వేచి చూస్తున్నాడు. కానీ తార‌క్ కి మాత్రం ఆర్.ఆర్.ఆర్ ఎప్ప‌టికి పూర్త‌వుతుంది? అన్న‌దానిపై క్లారిటీ లేదు. పైగా త‌న‌కోసం కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు వేచి చూస్తుండ‌డం మ‌రో ఇబ్బందిక‌ర స‌న్నివేశంగా మారింది.

మ‌రోవైపు మ‌హేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఓవైపు ప‌ర‌శురామ్ తో సినిమా చేస్తూనే త‌దుప‌రి చిత్రం కోసం ప్లాన్ చేస్తున్న మ‌హేష్ అనీల్ రావిపూడిని ప‌క్క‌న పెట్టి రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నారు. అటుపైనా త్రివిక్ర‌మ్ నే ఎంపిక చేసుకుంటున్నాడ‌ట‌. ఇక త్రివిక్ర‌మ్ వైపు నుంచి చూస్తే తార‌క్ తో పాటు ప‌వ‌న్ .. మ‌హేష్.. వెంక‌టేష్ స‌హా ప‌లువురు హీరోలు ఆయ‌న జాబితాలో ఉన్నారు. అయితే వీళ్లంతా ఎవ‌రితో ముందుగా మొద‌లెడ‌తారు? అన్న‌దానిపై ఇప్పుడే స్ప‌ష్ఠ‌త నివ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప్రాజెక్టుల్లో ఎవ‌రు ముందు ఎవ‌రు వెన‌క అన్న‌దానిపై ఎలాంటి స్ప‌ష్ఠ‌తా రాలేదు. అయితే స్టార్లు మాత్రం తెలివిగా ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో స్క్రిప్టులు విని ద‌ర్శ‌కుల్ని లాక్ చేసి లీడ్ లో ఉంచుతున్నారు. ఏది ఎప్ప‌టికి సెట్స్ కెళుతుంది? అన్న‌దానిపై క్లారిటీ లేక క‌న్ఫ్యూజ‌న్ తో ఉన్నారు!
Tags:    

Similar News