షెహన్ షాకు సలాం

Update: 2017-10-11 04:44 GMT
ఆయన మాటలకు బాలీవుడ్ ఈలలేసింది. ఆయన స్టెప్పులు చూసి గంతులేసింది. ఆయన ఫైట్స్ చూసి రెచ్చిపోయింది. ఆయన కన్నీరు చూసి కరిగిపోయింది. మొత్తానికి గత 50 సంవత్సరాలుగా బాలీవుడ్ ఆయన చెయ్యి పట్టుకునే నడిచింది. ఆయనే మేరునగ ధీరుడు అమితాబ్ బచ్చన్. కాలం తెచ్చిన మార్పులకు ఏ మాత్రం లొంగకుండా తనను తాను నిత్య నూతనంగా తీర్చిదిద్దుకుని నిలబడిన గొప్ప నటుడు.

బిగ్ బీ - షెహన్ షా - లెజండరీ యాక్టర్ ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నా అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పటికీ సూపర్ స్టార్. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ లోకమంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈసారి ఎలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోవడం లేదని ఆయన ముందుగానే ప్రకటించారు.  బిగ్ బీ బర్త్ డే సందర్భంగా పలువురు నటులు ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తూ తమ ఫీలింగ్ షేర్ చేసుకున్నారు.

అమితాబ్ ఓ లెజండ్. ఓ లెజెండ్ తో కలిసి నటించడం నా అదృష్టం. ఆయనతో కలిసి పనిచేయడం నా కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.  - టబు

ఆయన వయసు పెరుగుతోందనే విషయం నా ఏమాత్రం నచ్చడం లేదు. నా వరకు ఆయన వయసు ఇంకా 35 సంవత్సరాలే. - రామ్ గోపాల్ వర్మ

అమితాబ్ సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయన సినిమాలు ఎందరో నటులకు ఇన్ స్పిరేషన్. - కల్కికొచ్లిన్.
Tags:    

Similar News