భీష్మ రెండు రోజుల కలెక్షన్స్

Update: 2020-02-23 10:21 GMT
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక మందన్న జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'భీష్మ'.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూస్..  మౌత్ టాక్ రావడంతో సినిమాను మొదటి రోజే హిట్ అని తేల్చారు.  అన్నీ సెక్షన్ల ఆడియన్సుకు కనెక్ట్ అయ్యే సినిమా కావడంతో  కలెక్షన్స్ కూడా జోరుగా ఉన్నాయి.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా షేర్ సాధించిన 'భీష్మ' రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు కొనసాగించింది. రెండవ రోజు దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేయడంతో రెండు రోజుల కలెక్షన్లు పది కోట్ల మార్కును దాటాయి.  బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాలతో పోటీ లేకపోవడం.. ఈ సినిమా అన్నీ వర్గాలను మెప్పించే సినిమా కాబట్టి లాంగ్ రన్లో భారీ వసూళ్లు తీసుకురావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

తెలుగు రాష్ట్రాల్లో భీష్మ రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
 
నైజామ్: 4.08 cr
ఉత్తరాంధ్ర: 1.19 cr
సీడెడ్: 1.53 cr
కృష్ణ: 0.68 cr
గుంటూరు: 1.01 cr
ఈస్ట్: 0.90 cr
వెస్ట్: 0.71 cr
నెల్లూరు: 0.35 cr

ఎపీ+తెలంగాణా టోటల్: రూ. 10.09 cr
Tags:    

Similar News