సాంగ్ అఫ్ భరత్- హత్తుకుందిగా

Update: 2018-03-25 05:35 GMT
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మహేష్ బాబు తొలిసారి సిఎం పాత్రలో నటిస్తున్న భరత్ అనే నేను ఫస్ట్ ఆడియో ట్రాక్ విడుదల చేసారు. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం” అంటూ సాగే ఈ పాటను భరత్ విజన్ అనే పేరుతో రిలీజ్ చేయటం విశేషం. భరత్ పాత్రలోని ఔచిత్యాన్ని దానికున్న ఉద్దేశాన్ని  చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి  అందించిన సాహిత్యం ఉన్నత విలువలతో ఉంది.  బ్లాక్ మార్కెట్ ని అరికట్టి అవినీతిని అంతమొందించే విధంగా మాటకు కట్టుబడి ఉంటానని చెబుతూ థిస్ ఈజ్ మీ(ఇది నేను)అంటూ చక్కని రిథంతో దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ ఫాస్ట్ బీట్ తో ఉండాల్సిన సాంప్రదాయానికి భిన్నంగా మంచి మెలోడీతో ట్యూన్ చేయటం విశేషం. పాలించే ప్రభువులు - సేవించే బంటులు అంటూ ప్రభుత్వ కర్తవాన్ని ప్రభోదిస్తూ 'భరత్ అను నేను హామీ ఇస్తున్నాను' అంటూ పాట ఆద్యంతం డేవిడ్ సైమోన్ గొంతులో చాలా ఫ్రెష్ గా అనిపించింది.

తెలుగు పదాలను ఎంతో పొద్దికదా  అర్థవంతంగా వాడిన రామజోగయ్య శాస్త్రికి ధీటుగా దేవి తన టాలెంట్ చూపించడం విశేషం. 'అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి' అంటూ అద్భుతమైన చరణాలతో  ఆద్యంతం కట్టి పడేసారు. ఖైది నెంబర్ 150 లో నీరు నీరు పాట ద్వారా ఎమోషనల్ గా టచ్ చేసిన రామజోగయ్య శాస్త్రి మరోసారి అలాంటి ఘనత ఈ పాటతో సాదిస్తారు అనిపిస్తోంది. హోరుమనిపించే వాయిద్యాలు లేకుండా చాలా సింపుల్ గా క్యాచీ ఉన్న ఈ పాటలో అక్కడక్కడ డేవిడ్ సైమోన్ కొన్న్ని పదాలు పలకడంలో ఇబ్బంది వినిపించినా మంచి ఫీల్ ఉండటంతో ఆది అందులో కలిసిపోయింది. మొత్తానికి భరత్ విజన్ అంటూ వదిలిన మొదటి పాట అంచనాలు నిలబెట్టుకునేలా ఉంది అని చెప్పొచ్చు.

బాధ్యతను ప్రవచించే పాట కాబట్టి దానికి తగ్గట్టు ఉన్న సాహిత్యం, సంగీతం రెండూ కూడా పోటీ పడ్డాయి.మొత్తానికి భరత్ రంగంలోకి దిగాడు. డ్యూయెట్స్ ఎలా ఉంటాయా అన్న ఆసక్తి అప్పుడే మొదలయింది. ఏప్రిల్ 20 విడుదలకు పాతిక రోజులే ఉంది కనక ప్రమోషన్ వేగం పెంచనున్నారు. కొరటాల శివ మార్క్ సామాజిక బాధ్యత ఈ ఫస్ట్ సాంగ్ లోనే బయట పడటం విశేషం. 

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News