ఈ సారి స్వీటీని ఏం చేస్తాడో?

Update: 2019-02-17 07:13 GMT
చాలామంది స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు కానీ కొందరే హీరోలుగా నిలదొక్కుకుంటారు.  బ్యాక్ అప్ ఉండి కూడా హీరోలుగా సెటిల్ అయ్యేందుకు సతమతమవుతున్న స్టార్ కిడ్స్ కు రానా దగ్గుబాటి ఒక ఇన్స్పిరేషన్ లా నిలుస్తాడనడంలో సందేహం లేదు.   హీరోగా మొదట్లో సక్సెస్ సాధించకపోయినా నిరుత్సాహపడకుండా విభిన్న కథాంశాలు ఎంచుకుంటూ.. .. ఇతర భాషలలో అతిథి పాత్రలు చేస్తూ దూసుకెళ్లిన రానాకు 'బాహుబలి' లో భల్లాల దేవ పాత్ర మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత రానా క్రేజీ యాక్టర్ గా మారిపోయాడు.   

'హాథి  మేరా సాథీ'.. '1945' లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రానా ఈమధ్య మరో సినిమాలో ఒక కీలక పాత్ర పోషించేందుకు పచ్చజెండా ఊపాడట.  ఇంతకీ ఆ సినిమా ఏంటంటే .. 'సైలెన్స్'.  టాలీవుడ్ స్వీటీ అనుష్క నెక్స్ట్ ఫిలిం.   'భాగమతి' తర్వాత గ్యాప్ తీసుకొని మరీ స్లిమ్ము అవతారం లోకి మారిన అనుష్క 'సైలెన్స్' అనే టైటిల్ తో తెరకెక్కనున్న థ్రిల్లర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మెజారిటీ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో కీలకపాత్రను రానాకు ఆఫర్ చేశారని.. క్యారెక్టర్ నచ్చడంతో రానా ఆ సినిమాలో నటించేందుకు వెంటనే అంగీకరించాడని సమాచారం.

'రుద్రమదేవి' సినిమాలో అనుష్కకు జోడీగా నటించిన రానా దగ్గుబాటి.. 'బాహుబలి' లో అనుష్కను వేధించే విలన్ పాత్రలో నటించాడు. మరి ఈ 'సైలెన్స్' లో స్వీటీ ని ఏం చేస్తాడో వేచి చూడాలి.  ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. 
Tags:    

Similar News